అబ్బో.......ఏకంగా ముగ్గురు భామలతో రొమాన్స్ చేయనున్న సూపర్ స్టార్.....???

GVK Writings

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం కొనసాగుతున్న ఈ లాక్ డౌన్ సమయాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఇటీవల వరుసగా మూడు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న మహేష్, తదుపరి నటించబోయే సర్కారు వారి పాట మూవీతో కూడా సక్సెస్ కొట్టాలని, స్క్రిప్ట్ విషయంలో చాలా గట్టిగా శ్రద్ధ తీసుకున్నట్లుగా లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అలానే ఈ సినిమాలో తన పాత్ర కోసం పూర్తిగా జుట్టు బాగా పెంచుతూ, ఒక డిఫరెంట్ స్టైల్ మేకోవర్ తో సిద్ధమవుతున్న మహేష్ బాబు, ఈ మూవీలో కీర్తి సురేష్ తో కలిసి తొలిసారిగా నటిస్తున్నారు. 

యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు ఎంతో భారీ రేంజ్ లో నిర్మించనున్నాయి. ఎస్, ఎస్. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి తో పాటు మరొక హీరోయిన్ కూడా నటించబోతోంది అంటూ ఇటీవల కొద్దిరోజులుగా వార్తలు రావడం జరిగింది. అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని అంటున్నారు. 

 

కాగా ఆ మిగతా ఇద్దరు హీరోయిన్ల కోసం ఇప్పటికే వేట మొదలెట్టిన దర్శకుడు పరుశురామ్, అతిత్వరలో వారిని ఫైనలైజ్ చేయనున్నారని సమాచారం. కథ రీత్యా ముగ్గురు హీరోయిన్ల పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. బ్యాంకు మోసాల నేపథ్యంలో మంచి సోషల్ మెసేజ్ తో, పలు కమర్షియల్ అంశాలు కలగలిపి దర్శకుడు పరశురామ్ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. కాగా ఈ సినిమా హీరోయిన్ల విషయమై ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తకు సంబంధించి, సర్కారు వారి పాట మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: