పవన్ చేయాల్సిన ఆ సినిమా చరణ్ చేశాడా..?

shami

ఒక హీరో కాదన్న సినిమాని మరో హీరో చేయడం అనేది కామన్. కథ నచ్చక కొంతమంది కొన్ని సినిమాలు మిస్ అవుతారు. కొన్నిసార్లు ఓ స్టార్ హీరో డేట్స్ అడ్జెస్ట్ కాక కూడా సినిమాలు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ మెగా హీరో చేయాల్సిన ఓ సినిమా మరో మెగా హీరో చేసి హిట్టు కొట్టడం విశేషం. వి.వి.వినాయక్ డైరక్షన్ లో రాం చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా నాయక్. 2013లో వచ్చిన ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నా చరణ్ క్రేజ్ మీద ఆడేసింది.

 

ఆకుల శివ కథ అందించిన ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. అమలా పాల్, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటించగా థమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో రాం చరణ్ డ్యుయల్ రోల్ లో మెప్పించాడు. అయితే ఈ సినిమా కథను ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్లాడట వినాయక్. పవన్ కూడా కథ విని లైన్ బాగుందని.. తన కన్నా చరణ్ కు ఈ కథ బాగుంటుందని చెప్పాడట.

 

అలా పవన్ చేయాల్సిన ఆ సినిమాను చరణ్ కు రిఫర్ చేశాడు పవన్ కళ్యాణ్. చిరు, చరణ్ అయినా మగధీర, బ్రూస్ లీ, ఖైది నంబర్ 150 సినిమాల్లో కనిపించారు కాని పవర్ స్టార్, రాం చరణ్ మాత్రం ఇప్పటివరకు స్క్రీన్ మీద కనిపించలేదు. బాబాయ్ అబ్బాయ్ కాంబో సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. రాం చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ లో పవన్ తో ఓ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు.                                 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: