చిరంజీవి నా దైవం.. యువహీరో ఆసక్తికర వ్యాఖ్యలు..?

praveen

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది యువ నటులకు స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై తన నటనతో డాన్సులతో తెలుగు ప్రేక్షకులందరి  హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.  తన మంచి మనసుతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికి  కూడా టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూనే ఉన్నారు . అయితే మెగాస్టార్ చిరంజీవి.. నటుడిగా తనని తాను నిరూపించు కోవాలి అనుకునే  యువనటులకి ఎంతో  స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే యువనటుడు సత్యదేవ్ తాను సినిమాల్లోకి రావడానికి అసలు కారణం మెగాస్టార్ చిరంజీవి అని చెబుతున్నారు. 

 

 ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో  తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సత్యదేవ్ ఆ తర్వాత... జ్యోతిలక్ష్మి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు... ఆ తర్వాత బ్లఫ్ మాస్టర్ బ్రోచేవారెవరురా.. ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాలతో మరింత క్రేజ్  సంపాదించాడు. ప్రస్తుతం ఉమా  మహేశ్వర  ఉగ్ర  రూపస్య అనే  సినిమాలో నటిస్తున్నారు. అయితే యువ నటుడు సత్యదేవ్... చిరంజీవిని   ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినీమాల్లో  వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఇటీవలే బ్లఫ్ మాస్టర్ సినిమా చూసిన చిరంజీవి చిత్ర యూనిట్ ను ఇంటికి పిలిపించి అభినందించారు. 


 చిన్నప్పటినుంచి తాను అభిమానించే చిరంజీవి తనను పిలిచి అభినందించడం తో తన ఆనందానికి అవధులు లేవు అంటూ చెప్పుకొచ్చాడు సత్యదేవ్. తాను చిన్నప్పటి నుంచి ఏ పని చేయాలని తలపెట్టిన... అనుకున్నది చేయడానికి నువ్వు ఏమైనా చిరంజీవివా  అంటూ చాలామంది అన్నారు అని... అప్పటి నుండి చిరంజీవి అంత  గొప్పవాడివి కావాలని ధృడ  సంకల్పంతో ముందుకు సాగాను  అంటూ చెప్పుకొచ్చారు సత్యదేవ్. చిరంజీవిల అవ్వాలని అనుకున్న కోట్లమంది లో తాను కూడా ఒకడిని అంటూ తెలిపాడు, తనలాగా నటుడు కావాలని వచ్చిన ఎంతో మంది నటులకు కష్ట సమయాల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి ఎదిగిన తీరు గుర్తుకు వచ్చి ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంది అని తెలిపారు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి చిరంజీవిని తన దైవంగా భావిస్తున్నట్లు సత్యదేవ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: