ఓ యంగ్ మేకర్ తో సినిమాకు చరణ్ ప్లాన్ !
రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత ఎంత పెద్ద సినిమా చేస్తాడు. ఇంత భారీ మూవీ తర్వాత చెర్రీ ఎవరి డైరెక్షన్ లో నటిస్తాడు. పాన్ ఇండియన్ ఇమేజ్ ని కంటిన్యూ చేసేందుకు ఎలాంటి స్కెచ్చెస్ రెడీ చేస్తాడు అని మెగా ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే చెర్రీ మాత్రం వీళ్లందరిని సర్ ప్రైజ్ చేస్తూ ఓ యంగ్ మేకర్ తో సిినిమాకు ప్లాన్ చేస్తున్నాడు చరణ్.
రామ్ చరణ్ ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో భారీ పీరియాడికల్ డ్రామా ట్రిపుల్ ఆర్ చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమా 5భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీతోనే చాలా ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్ కి వెళ్తున్నాడు చరణ్. ఇంతకుముందు డైరెక్టర్ మూవీ జంజీర్ తో బాలీవుడ్ కు వెళ్లాడు చెర్రీ. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.
రామ్ చరణ్ మళ్లీ 7ఏళ్ల తర్వాత హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్తున్నాడు. బాహుబలి దర్శకుడు తీస్తోన్న సినిమా అనే ఇమేజ్ తో ట్రిపుల్ ఆర్ పై నార్త్ లో మంచి ఇమేజ్ ఉంది. చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ తో మార్కెట్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాడు. మరి ఈ మూవీతో పెరిగే మార్కెట్ ని మరో స్టేజ్ కి తీసుకెళ్లేందుకు చరణ్ ఎలాంటి సినిమాలు చేస్తాడు అంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిిస్తోంది.
ఛలో, భీష్మ సినిమాలతో ఆకట్టుకున్న వెంకీ కుడుముల, రామ్ చరణ్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడని టాక్ వస్తోంది. ఈ కథను మెగా కాంపౌండ్ ఓకే చేస్తే వెంకీ తర్వాత చెర్రీ డైరెక్ట్ చేస్తాడని చెబుతున్నారు. మరి వెంకీ కుడుమల హిందీ మార్కెట్ కు కూడా సెట్ అయ్యేలా యూనివర్సల్ సబ్జెక్ట్ ని రెడీ చేస్తున్నాడా..లేక తెలుగు మార్కెట్ కు తగ్గట్టుగా కథ రాస్తున్నాడా అనేది తెలియాలి.