బాలీవుడ్ లో అవన్నీ భయంకర అనుభవాలే.. 'సాహో' భామ నిజాలు..?
బాలీవుడ్ లో నెపోటిసమ్ ఎక్కువగా ఉంటుంది.. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో ఉన్న బంధుప్రీతి గురించి మరింత ఎక్కువగా విమర్శలు రావడం మొదలయ్యాయి. బాలీవుడ్ కు చెందిన ప్రముఖులపై కొంతమంది నటులు ఏకంగా బహిరంగంగానే విమర్శలు చేయడం సంచలనం గా మారిపోయింది. నటులు ఏదో ఒక విధంగా బాలీవుడ్ లో ఉన్న బంధు ప్రీతి గురించి బయటకు చెబుతున్నారు. అంతేకాకుండా యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా బంధుప్రీతి కారణంగానే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఆరోపణలు కూడా చేశారు
అయితే తాజాగా బాలీవుడ్ లో ఉన్న బంధు ప్రీతి గురించి మరో నటి కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాహో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమైనా జర్మన్ మోడల్ ఎవ్లీవ్ శర్మ బాలీవుడ్లో కూడా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నది . ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఎవ్లీవ్ శర్మ పలు గ్లామర్ పాత్రల్లో నటించి ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది. అయితే తాజాగా బాలీవుడ్ నటి ఎవ్లీవ్ శర్మ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెలకొన్న బంధు ప్రీతి గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ లో ఉన్న బంధుప్రీతి కారణంగా తాను ఎన్నో అవకాశాలను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో అధికారం డబ్బుతోనే ఏదైనా చేయటం సాధ్యం అవుతుందని.. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదగడం మాత్రం ఎంతో కష్టం అంటూ తెలిపింది. గతంలో నాకు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ... చివరికి వారు నన్ను సినిమాల నుంచి తొలగించారు అంటూ తెలిపింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పాత్రలు ఎన్నో సార్లు ఇలా దూరం అయిపోయాయి అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. ఇక నాకు వచ్చిన పాత్రలన్నీ నిర్మాతలకు దర్శకులకు దగ్గర అయిన వాళ్ళకి... ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ గా కొనసాగుతున్న వారసులకు మాత్రమే దక్కాయి అంటూ తెలిపింది. అలాంటి ఎన్నో భయంకర అనుభవాలను దాటుకుంటూ వచ్చాను అంటూ తెలిపింది ఎవ్లీన్ శర్మ.