ఆడియెన్స్ ను భయపెట్టాలని నిర్ణయించుకున్న విక్రం కుమార్..!

shami

13బి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విక్రం కుమార్ అక్కినేని మనంతో డైరక్టర్ గా క్రేజీ హిట్ అందుకున్నాడు. నితిన్ తో ఇష్క్, అఖిల్ హలో, నాని గ్యాంగ్ లీడర్ ఇలా తన మార్క్ సినిమాలను తీస్తూ వస్తున్న విక్రం కుమార్ తన నెక్స్ట్ మూవీ నాగ చైతన్యతో ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు థ్యాంక్యూ టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. ఇదే కాకుండా విక్రం కుమార్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో కూడా సినిమా తీస్తాడని కూడా వార్తలు వచ్చాయి.

 

ఈ రెండు సినిమాలేమో కాని విక్రం కుమార్ ఓ హారర్ సినిమా చేయాలని మాత్రం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అందుకు సంబందించిన కథ కూడా సిద్ధం చేశాడట. తన మొదటి సినిమా 13బి హారర్ కథతోనే తెరకెక్కించాడు విక్రం కుమార్. మళ్లీ ఇన్నాళ్లకు అదే జానర్ సినిమా తీయాలని అనుకుంటున్నాడట. భాష ఏదైనా హారర్ సినిమాలకు డిమాండ్ బాగా ఉంటుంది. సీట్ ఎడ్జ్ లో ఆడియెన్స్ ను కూర్చోబెట్టగలిగే స్క్రీన్ ప్లే ఉంటే సినిమా పక్కా హిట్ అయినట్టే.

 

అందుకే విక్రం కుమార్ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసే సినిమాలను పక్కన పెట్టి వారిని భయపెట్టే సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఈ సినిమా గురిచి పూర్తి డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. తెలుగు, తమిళ భాషల్లో విక్రం హారర్ సినిమా ఉంటుందట. స్టార్ హీరోతోనే ఈ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. అల్లు అర్జున్, మహేష్ బాబులకు కథ వినిపిచినా వాళ్లెవరు ఇప్పుడప్పుడే ఈ డైరక్టర్ తో చేయడం కష్టమని తెలిసి. ఓ అద్భుతమైన హారర్ కథ సిద్ధం చేసుకుని దానితో తన సత్తా చాటాలని చూస్తున్నాడు విక్రం కుమార్.                

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: