సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో.. న‌లుగురు డాక్ట‌ర్ల‌ను విచారించిన పోలీసులు!

Edari Rama Krishna

బాలీవుడ్ స్టార్ హీరో, ఎంఎస్ ధోని ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో సుశాంత్ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ‘ఎం.ఎస్‌.ధోనిః ద అన్‌టోల్డ్‌ స్టోరీ’, `త్రీ ఈడియ‌ట్స్‌`, ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’, ‘పీకే’, ‘డిటెక్టీవ్‌ బొమ్‌కేష్‌ బక్షి’, ‘రాబ్టా’, ‘వెల్‌కమ్‌ న్యూయార్క్‌’, ‘కేదార్‌నాథ్‌’, ‘సోంచారియా’, ‘చిచ్చోర్‌’, ‘డ్రైవ్‌’ త‌దిత‌ర చిత్రాల‌లో ఆయ‌న న‌ట‌న ఆక‌ట్టుకుంది. యువ హీరోల బ్యాచ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ బాలీవుడ్ లో బంధుప్రీతి ఎక్కువ ఉండటం.. కొంత కాలంగా తనకు ఛాన్సులు రాకపోవడంతో డిప్రెషన్ కి లోనై  త‌న ఇంట్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే.

అనుమానాస్ప‌దంగా మారిన ఈ కేసులో ముంబై పోలీసుల ఇప్ప‌టికే అనేక మంది బాలీవుడ్ ప్ర‌ముఖుల్ని విచారించారు. అయితే ఇదే కేసుతో లింకు ఉన్న డాక్ట‌ర్ల‌ను కూడా పోలీసులు విచారిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త కొంత కాలంగా సుశాంత్‌.. మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు పోలీసులు గ్ర‌హించారు. ఈ కోణంలో ప్ర‌స్తుతం న‌లుగురు డాక్ట‌ర్ల‌ను కూడా పోలీసులు ప్ర‌శ్నిస్తున్న‌ట్లు తెలిసింది.

ప్ర‌ఖ్యాత సైక్రియాట్రిస్ట్ డాక్ట‌ర్ కెర్‌సీ బోమి చావ్డాతో పాటు మ‌రో ముగ్గురు సైక్రియాట్రిస్ట్‌ల వ‌ద్ద సుశాంత్ చికిత్స తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.  ఇదిలా ఉంటే  న‌వంబ‌ర్ 2019 నుంచి మార్చి 2020 ఈ న‌లుగురు డాక్ట‌ర్ల‌ను సుశాంత్ విజిట్ చేశాడు.  ఈ నేపథ్యంలోనే ఈ నలుగురు డాక్టర్లను పోలీసులు విచారణ చేసినట్లు సమాచారం. చనిపోయే ముందు ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందన్న కోణంలో  పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: