టాలీవుడ్ కుర్రాళ్ల ఫిట్ నెస్ మంత్రం !
కరోనా కాలంలో ఫిజికల్ ఫిట్ నెస్ చాలా ఇంపార్టెంట్ అని చెబుతున్నారు డాక్టర్లు. ఇక డాక్టర్లు గట్టిగా చెప్పడంతో టాలీవుడ్ కుర్రాళ్లు కూడా ఫిట్ నెస్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. హోమ్ క్వారంటైన్ ని జిమ్ సెషన్ గా మార్చుకొని.. కండలు పెంచుతున్నారు. ఇక లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోలైతే షాకింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ తో సర్ ప్రైజ్ చేస్తున్నారు.
నాగ శౌర్యకు లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. ఈ లుక్ కు తగ్గట్టుగానే సింపుల్ లవబుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటిస్తాడు శౌర్య. కానీ ఇప్పుడీ లుక్ మొత్తాన్ని మార్చేశాడు శౌర్య. కరోనా లాక్ డౌన్ ని బాడీ బిల్డింగ్ కి కేటాయించి, రఫ్ స్టార్ గా మారిపోయాడు. రీసెంట్ గా నాగశౌర్య పులప్స్ చేస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో శౌర్య సిక్స్ ప్యాక్ ని చూపించి, చూపించకుండా సర్ ప్రైజ్ చేశాడు.
సినిమాకో జానర్ లోకి వెళ్లే వరుణ్ తేజ్ ఇప్పుడు కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ డ్రామా చేస్తున్నాడు. ఈ మూవీ కోసం ప్రాక్టీస్ చేస్తుండగానే లాక్ డౌన్ వచ్చింది. ఇక ఈ టైమ్ మొత్తాన్ని వర్కవుట్స్ కే కేటాయించాడు. ఖాళీ దొరికితే చాలు, పంచింగ్ బ్యాగ్ తో గడిపేస్తున్నాడు. బాక్సర్ లా కనిపించేందుకు కండల వీరుడిగా మారాడు వరుణ్.
యూత్ స్టార్ నిఖిల్ ఈ లాక్ డౌన్ ని అన్ని యాంగిల్స్ లో ఉపయోగించుకున్నాడు. కరోనా కాలంలోనే పెళ్లి చేసుకున్న నిఖిల్, ఈ సీజన్ ని బాడీ బిల్డింగ్ కు కేటాయించాడు. ఒకవైపు కరోనా వారియర్స్ కోసం తనవంతు సాయం చేస్తూనే.. పర్సనల్ గోల్ వైపు అడుగులు వేస్తున్నాడు. మజిల్డ్ బాడీతో ఫోటోలు అప్ లోడ్ చేస్తూ, టార్గెట్ ని రీచ్ అవుతున్నాయని అప్ డేట్స్ కూడా ఇస్తున్నాడు నిఖిల్.ఇక కార్తికేయ2 కోసమే నిఖిల్ బాడీ బిల్డ్ చేస్తున్నాడు.