సుడిగాలి సుధీర్‌ రొమాన్స్ పై రష్మీ హాట్ హాట్ కామెంట్స్..?

Chakravarthi Kalyan

సుడిగాలి సుధీర్, రష్మీ.. ఈ జంట గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు చాలా అరుదు.. అంతగా ఫేమస్ అయ్యారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మొదలైన వీళ్ల కాంబినేషన్ ఆ తర్వాత అనేక కార్యక్రమాల్లో కొనసాగింది. ఇక వీళ్లిద్దిరి రొమాన్స్ కూడా అంతే హాట్ టాపిక్. ఈ టాపిక్ పై ఏకంగా టీవీల్లో ప్రత్యేకమైన ప్రోగ్రాములే రూపొందించారు. 

 

 

అలాంటి సుధీర్, రష్మీ ఇటీవల ఓ ప్రోగ్రామ్‌లో జంటగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ షోలో అనేక ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు. ప్రత్యేకించి సుధీర్ రొమాన్స్ గురించి, అతనిలోని రొమాంటిక్ యాంగిల్ గురించి రష్మీ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్స్ కు తెరలేపుతున్నాయి.  

 

 

ఇంతకీ రష్మీ ఏమందంటే.. “ సుధీర్‌ చాలా రొమాంటిక్‌. రొమాంటిక్‌ అనే డ్రమ్ము ఉంటే... అందులో సుధీర్‌ను భగవంతుడు ముంచి తీశాడు. సుధీర్‌లో రొమాంటిక్‌ యాంగిల్‌ చాలా బాగుంటుంది.  కొంతమందిలో కోపం ఎక్కువ ఉంటుంది. కానీ సుధీర్‌ సున్నితమైన మనిషి.. అంటూ తెగ మెచ్చుకుంది.  

 

ఇంకా రష్మీ ఏమందంటే.. సుధీర్‌కి అతిమంచితనం ఉందని... అప్పుడప్పుడు దాని వల్ల చిరాకు కూడా కలుగుతుంటుందని కామెంట్ చేసింది. ఒక్కోసారి మంచివాడేనా.. లేక నటిస్తున్నాడా అనిపిస్తుంటుందట. అతని అతిమంచితనం ఒక్కోసారి ఇబ్బందిపెడుతుంది కూడా అంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: