ట్రైలర్ తోనే సినిమా రేంజ్ ఏంటో చూపించిన 'మహర్షి'......!!

GVK Writings

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మహర్షి. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలు అందుకుని సూపర్ హిట్  కొట్టింది. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కామెడీ హీరో అల్లరి నరేష్, మహేష్ బాబుకు స్నేహితుడిగా కనిపిస్తారు. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి. సినిమా బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిన ఈ సినిమా, ఫస్ట్ లుక్ టీజర్ తోనే ప్రేక్షకుల మదిలో ఒక ఆలోచన క్రియేట్ చేసింది. 

ఆ తరువాత రిలీజ్ అయిన ట్రైలర్ అప్పట్లో అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్లింది. ట్రైలర్ ని పరిశీలిస్తే మొత్తం మూడు రకాల విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో మహేష్ ఈ సినిమాలో కనపడనున్నారని, అలానే అల్లరి నరేష్ ది ఖచ్చితంగా గుర్తుండిపోయే పాత్రగా నిలుస్తుందని అర్ధమవుతుంది. యాక్షన్, ఎమోషన్, కామెడీ, సాంగ్స్ ఇలా పలు అంశాలు అన్ని ట్రైలర్ లో చూపించిన దర్శకుడు, ఆ తరువాత రిలీజ్ అయిన సినిమాతో ప్రేక్షకుల అంచనాలు అందుకున్నాడు. ఇక ట్రైలర్ రిలీజ్ అనంతరం తప్పకుండా సినిమా మంచి సక్సెస్ కొడుతుందని భావించిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలు కూడా నెరవేరాయి. 

 

 

మహేష్ బాబు రిషి అనే సాప్ట్ వేర్ కంపెనీ సిఈఓ గా కన్పించిన ఈ సినిమాలో నరేష్ ఒక వ్యవసాయ కుటుంబం నుండివచ్చిన యువకుడిగా, మహేష్ కు స్నేహితుడిగా కనిపిస్తారు. మొత్తంగా మహేష్ బాబు, వంశీ పైడిపల్లి ల తొలి కాంబినేషన్ లో తెరకెక్కిన మహర్షి సినిమా, రిలీజ్ ముందే ట్రైలర్ తో ప్రేక్షకాభిమానుల్లో మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడంతో పాటు, ఆ తరువాత థియేటర్స్ లో రిలీజ్ అయి వారి అంచనాలు అందుకుని సూపర్ హిట్ కొట్టడం విశేషం......!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: