సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో నిజంగా అది సూపర్ సాంగ్ అబ్బా.....!!

GVK Writings

సూపర్ స్టార్ మహేష్ బాబు, యువ దర్శకుడు అనిల్ రావిపూడి ల తొలి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు తొలిసారిగా, అజయ్ కృష్ణ అనే మిలటరీ మేజర్ పాత్రలో నటించిన ఈ మూవీ, మొన్నటి సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు మహేష్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు దర్శకుడు అనిల్ ఈ సినిమాలో పొందుపరచడం జరిగింది. మహేష్ సరసన రష్మిక మందన్న తొలిసారిగా జోడి కట్టిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా, సక్సెస్ఫుల్ ఫోటోగ్రాఫర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. 

ఏకే ఎంటర్టైన్మెంట్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన ఈ సినిమాలో ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించారు. ఇకపోతే ఈ సినిమాకు దేవిశ్రీ అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా థియేటర్లో అదిరిపోయింది. మరీ ముఖ్యంగా సినిమాలోని మైండ్ బ్లాక్ సాంగ్ అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రేక్షకులతో కూడా థియేటర్స్ లో విపరీతంగా విజిల్స్ కొట్టించింది. మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత నటించిన మాస్ సాంగ్ కావడంతో పాటు, ఈ మైండ్ బ్లాక్ సాంగ్ లో మహేష్, రష్మికల జోడి కూడా అదిరిపోయింది. 

 

అలానే చాలారోజుల తర్వాత మహేష్ కూడా ఈ పాటలో అదిరిపోయే రేంజ్ లో డాన్స్ ఇరగదీయడంతో, పాట మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే అటు ఆడియో పరంగా ఎంతో సక్సెస్ఫుల్ గా అలరించిన ఈ సాంగ్, ఇటీవల ఇటు వీడియో వెర్షన్ కూడా యూట్యూబ్ లో మొత్తం మూడు ఛానల్స్ లో కలిపి 100 మిలియన్లకు పైగా వ్యూస్ ని దక్కించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే మహేష్ బాబు నటించిన సినిమాలు అన్నిటిలోకి, ఈ మైండ్ బ్లాక్ సాంగ్ అతి పెద్ద మాస్ హిట్ సాంగ్ అని చెప్పవచ్చు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: