చేయకపోతే జేబుకు చిల్లు.... చేసామంటే బ్రతుకే నిల్లు.... ఎలాగబ్బా....??

GVK Writings

గత మూడు నెలల నుండి కరోనా మహమ్మారి కారణంగా మన దేశంలో కూడా మిగతా ఇతర దేశాల మాదిరిగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దానితో దాదాపుగా దేశంలోని అన్ని రంగాలు కూడా ఎంతో ఇబ్బందుల్లో పడ్డాయి. పలు రంగాల వారిని ఆదుకోవడానికి కేంద్రం కొంత ప్యాకెజీ ని ప్రకటించినప్పటికీ, జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఎంతో సమయం పడుతుందని అంటున్నారు ఆర్ధిక నిపుణలు. మరోవైపు ఈ మహమ్మారి దెబ్బకు సినిమా రంగం కూడా ఎంతో నష్టపోయింది. ముఖ్యంగా పనుల్లేక రోజువారీ సినీ కార్మికులు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. 

అయితే అటువంటి వారిని ఆదుకోవడానికి సినిమా ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు అందించడం జరిగింది. ఇక ముఖ్యంగా లాక్ డౌన్ దెబ్బకు చిన్న సినిమాలతో పాటు ఎన్నో పెద్ద సినిమాల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. అలానే తమ సినిమాల కోసం ఫైనాన్స్ తీసుకువచ్చిన పలువురు నిర్మాతలు పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డారు. కొన్ని సినిమాలు సగం షూటింగ్ పూర్తి చేసుకోగా, మరికొన్ని అయితే చివరిదశ వద్ద నిలిచిపోయాయి. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం సినిమాలు, సీరియల్స్ షూటింగ్స్ చేసుకోవచ్చని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతినిచ్చినప్పటికీ కరోనా ఎఫెక్ట్ దేశంలో అంతకంతకు పెరుగుతుండడంతో షూటింగ్స్ చేయాలా వద్దా అనే మీమాంస అందరు సినిమా యూనిట్స్ లో ఉంటోంది. 

 

దానికి తోడు ఆర్టిస్టుల కాల్షీట్స్ విషయంలో కూడా చాలామంది నిర్మాతలు సమస్యలు ఎదురుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే, ప్రభుత్వాల నుండి పర్మిషన్ రావడంతో హ్యాపీగా షూటింగ్స్ చేసుకుందామా అంటే, ఎవరి నుండి అయినా అనుకోకుండా కరోనా సోకితే బ్రతుకే నిల్లు అనే భయం ఓవైపు, పోనీ ధైర్యం చేసి మరికొద్దిరోజులు వాయిదా వేద్దామా అంటే తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక జేబులు చిల్లు మరోవైపు అనే చందాన నిర్మాతల పరిస్థితి తయారయిందని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: