ఇలియానా స్టార్ స్టేటస్ కు కారణం ఆ ఫైర్ బ్రాండే..!

Murali

ఒక్కోసారి అవకాశాలు ఒకరిని దక్కబోయి మరొకరికి దక్కుతాయి. అ అవకాశాలతో వారు అయితే స్టార్ అయిపోతారు.. లేదంటే అనవసరంగా చేసినట్టు అనిపిస్తోంది. ఇదే తరహాలో ఓ భారీ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ అవకాశం ఒకరికి దక్కిందే.. అనుకోని పరిస్థితిల్లో మరొకరికి దక్కింది. ఊహించని అవకాశాన్ని దక్కించుకున్న ఆ హీరోయిన్ ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయి ఇండస్ట్రీని ఏలేసింది. ఆ హీరోయినే ఇలియానా. ఆ సినిమా ‘పోకిరి’. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చల్లో ఈ విషయం రివీల్ అయింది.

 

బాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరోయిన్ పూజాభట్ సుశాంత్ మరణంపై ట్విట్టర్ లో స్పందించింది. ‘టాలెంట్ ఎక్కడున్నా తీసుకుంటాం. అలా చేయబట్టే కంగనా రనౌత్ లాంటి హీరోయిన్ గ్యాంగ్ స్టర్ సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయమైంది’ అంటూ ట్విట్టర్ లో తన అభిప్రాయం చెప్పింది. దీనికి కంగనా రియాక్ట్ అయింది. ‘టాలెంట్ ఉంటే ఎవరైనా తీసుకుంటారు. టాలెంట్ లేని వారికి అవకశాలు ఇవ్వటానికి ఎవరు సిద్ధపడతారు. అనురాగ్ బసుకు నా టాలెంట్ పై నమ్మకం ఉండబట్టే తీసుకున్నారు. అక్కడికొస్తే పోకిరి ఆడిషన్ లో హీరోయిన్ గా సెలక్ట్ అయ్యాను. కానీ.. గ్యాంగ్ స్టర్ లో అవకాశం రావడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నాను’ అని చెప్పుకొచ్చింది.

 

దీంతో పోకిరితో సెన్సేషనల్ స్టార్ అయిపోయిన ఇలియానా ఆ సినిమాకు ఫస్ట్ చాయిస్ కాదని తెలుస్తోంది. నిజానికి ఆ పాత్రకు అయేషా టకియాను కూడా అనుకున్నారని వార్తలు వచ్చాయి. అంటే.. ఇద్దరు చేయలేకపోయిన పాత్రను ఇలియానా దక్కించుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇదిలా ఉంచితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అంశం ఇంకా రోజురోజుకీ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పట్లో బాలీవుడ్ నెపోటిజంపై వేడి చల్లారేట్టు కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: