చరణ్ తో త్రివిక్రమ్...... వాస్తవమేంటంటే.....??
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తుండగా రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. రాబోయే సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 8 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారంటూ కొద్దిరోజలుగా పలు వార్తలు ప్రచారం అవుతూ వస్తున్నాయి. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ రెండు రోజుల నుండి చరణ్ తదుపరి సినిమా విషయమై మరొక వార్త తెరపైకి వచ్చింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయనున్నట్లు ఆ వార్త యొక్క సారాంశం. చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించనన్నట్లు టాక్. అయితే ఈ విషయమై అసలు జరిగింది ఇదే అని కొందరు సినిమా వర్గాల వారు అంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం వకీల్ సాబ్, క్రిష్ జాగర్లమూడి ల సినిమాలు చేస్తున్న పవన్, వాటి అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
అయితే దాని తరువాత త్రివిక్రమ్ తో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉండగా, దానికి సంబందించిన కథను ఇటీవల పవన్ కు వినిపించారట త్రివిక్రమ్, అయితే ఆ కథ విన్న పవన్, ఇది నాకు కాకుండా చరణ్ కు అయితే చాలా బాగుంటుంది, తనకి చెప్పండి అని అనడంతో, వెంటనే చరణ్ ని కలిసి కథను వినిపించిన త్రివిక్రమ్, ఆయనకు కథ ఎంతో నచ్చి ఆర్ఆర్ఆర్ అనంతరం చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. కాగా పవన్ తానే స్వంతగా చరణ్ హీరోగా ఈ సినిమా నిర్మిస్తారని అంటున్నారు. మరి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి వాస్తవాలు వెల్లడి కావాలంటే మరికొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే....!!