అడ్వాంటేజ్ తీసుకోకు అంటూ అదిరిపోయే సక్సెస్ కొట్టిన జెనీలియా.....!!

GVK Writings

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, జెనీలియా దేశ్ ముఖ్ హీరోయిన్ గా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రెడీ. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, ఆకట్టుకునే వెరైటీ స్క్రీన్ ప్లే తో ఆసక్తికరమైన కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమాకు అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కామెడీ మాత్రమే కాక, కథ పరంగా కూడా కొంత విభిన్నంగా సాగె ఈ సినిమాలో హీరో రామ్ తో పాటు హీరోయిన్ జెనీలియా కూడా తమదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. 

అంతకముందు బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్రలో నటించి మెప్పించిన జెనీలియా, అదే తరహాలో సరదాగా విధంగా ఈ సినిమాలో పూజ పాత్రలో కూడా నటించారు. ముఖ్యంగా ఆ పాత్ర సినిమాలో ఎంతో కీలమైంది, అలానే ఎంతో ఎంటర్టైనింగ్ గా కూడా సాగుతుంది. ఇక జెనీలియా, సినిమాలోని పలు చోట్ల హీరో రామ్ తో అడ్వాంటేజ్ తీసుకోకు అంటూ చెప్పే డైలాగ్ అప్పట్లో మంచి ఫేమస్ అయింది. కథలోని అక్కడక్కడా వచ్చే పలు సందర్భాల్లో జెనీలియా ఈ డైలాగ్ వాడుతుంది. ఈ విధంగా ఆకట్టుకునే పలు డైలాగ్స్ తో జెనీలియా సినిమా సక్సెస్ లో కొంత ముఖ్య పాత్ర పోషించారు. 

 

ఒకరకంగా ఆమె పాత్రను ఇంత బాగా రాసిన కథకులు, అలానే సినిమా తీసిన దర్శకుడు శ్రీనువైట్లకు కూడా కొంత క్రెడిట్ దక్కుతుంది. అప్పటికే కెరీర్ పరంగా మంచి సక్సెస్ లతో ముందుకు సాగుతున్న జెనీలియాకు రెడీ మూవీ కూడా సూపర్ హిట్ కొట్టడంతో ఆపై మరింత మంచి అవకాశాలు దక్కాయి. అలానే పలు ఇంటర్వ్యూల్లో కూడా తన కెరీర్ మలుపు తిప్పిన సినిమాల్లో రెడీ సినిమా పేరు కూడా జెనీలియా చెప్తూ ఉంటారు.....!!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: