అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నన్ను అలా పిలిపించుకోవడానికే ఇష్టపడతాను : సూపర్ స్టార్ మహేష్.....!!
టాలీవుడ్ సీనియర్ హీరో నటశేఖర్ కృష్ణ గురించి మన తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముందుగా తేనెమనసులు సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా పరిచమైన కృష్ణ, ఆ తరువాత నుండి తన టాలెంట్ తో ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన విషయం తెలిసిందే. ఇక తనకు వస్తున్న అవకాశాలను మంచి సక్సెస్ లు గా మలచుకుంటూ ముందుకు సాగిన కృష్ణ, ఆపై టాలీవుడ్ కి ఎన్నో రకాల నూతన హంగులను పరిచయం చేయడం జరిగింది. తన సినీ కెరీర్ లో దాదాపుగా మొత్తం 350కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ కు ఉన్న పేరు ప్రఖ్యాతలు, క్రేజ్, గురించి ఎంతచెప్పినా తక్కువే.
ఇక ఆయన తనయుడిగా మహేష్ బాబు, చిన్నతనం లోనే తెలుగు చిత్ర సీమకు బాలనటుడిగా పరిచయమవడం, అలానే కొన్ని సినిమాల్లో నటించిన అనంతరం కొంత విరామం తీసుకుని రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా రీఎంట్రీ ఇచ్చారు. ఇక తొలి సినిమా తోనే సూపర్ హిట్ కొట్టి ప్రిన్స్ గా, అలానే ఆపై ఎన్నో గొప్ప గొప్ప విజయాలు, కోట్లాది అభిమానుల మనసులు గెలుచుకున్న మహేష్ బాబు, సూపర్ స్టార్ గా తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతో గొప్ప పేరు గడించారు. ఇటీవల వరుసగా మూడు విజయాలు అందుకుని హ్యాట్రిక్ కొట్టిన మహేష్ బాబు, అతి త్వరలో పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటించనున్నారు.
ఇక నిన్న ప్రపంచ పితృ దినోత్సవం సందర్భంగా తండ్రి కృష్ణ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన మహేష్ బాబు, తన ప్రస్తుత ఈ స్టార్ స్టేటస్ కి, అలానే ఇంత గొప్ప లైఫ్ కి కారకులు తండ్రి కృష్ణ నే అని, తండ్రి చూపిన దారిలోనే తాను ఎల్లప్పుడూ నడుస్తానని, ఆయనే తన సూపర్ హీరో అని తన పోస్ట్ లో తెలిపారు. అలానే గతంలో కూడా పలు సందర్భాల్లో తండ్రి కృష్ణ గురించి మహేష్ మాట్లాడుతూ, తనకు కెరీర్ పరంగా ఎన్ని సక్సెస్ లు, ఎంత గొప్ప పేరు వచ్చినా సరే తాను మాత్రం సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా పిలిపించుకోవడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని మహేష్ చెప్పడం జరిగింది. అయితే తాను లైఫ్ లో ఎంత ఎదిగినప్పటికీ కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆదర్శాలను పాటించే వ్యకి అయిన మహేష్, ఈ విధంగా చెప్పడం, తండ్రి కృష్ణ పై ఆయనకున్న అపారమైన ప్రేమకు నిదర్శనమని అంటున్నారు ప్రేక్షకులు, అభిమానులు.....!!!