బాలుకి ఉన్న రిమార్క్ అదేనా..?

Gullapally Venkatesh

ఎస్పీ బాలు... ఈ పేరు గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆయన సినిమాలు గాని ఆయన పాడిన పాటలు గాని ఒక రేంజ్ లో ఉంటాయి అనే విషయం అందరికి తెలిసిన విషయమే. ఇక ఆయన మీద వచ్చిన విమర్శలు కూడా చాలానే ఉన్నాయి అప్పట్లో. ఎవరిని కూడా ఆయన పైకి రానిచ్చే వారు కాదు అని అంటూ ఉంటారు. చాలా మంది గాయకులూ ఆయన ను దాటి పైకి రాలేక వేరే భాషలకు వెళ్ళిపోయారు అని అంటారు. ఆయన తరంలో ఎవరిని కూడా ఆయన పైకి రానీయలేదు అని తన అవకాశాల కోసం చాలా మందిని ఇబ్బంది పెట్టారు అని కొందరు మాట్లాడుతూ ఉంటారు. 

 

ఇక ఆయనను దాటి ఒక సినిమాలో ఒక పాట పాడటం అనేది అప్పట్లో చాలా కష్టం అని కొందరు అంటారు. ఆయన  నుంచి ఇబ్బంది పడిన వారిలో చాలా మంది అగ్ర గాయకులూ కూడా ఉన్నారు అని అగ్ర హీరోల సినిమాలు అనగానే తానే పాడాలి అనే విధంగా ఆయన వ్యవహరించారు అని చెప్తూ ఉంటారు. చాలా మందిని ఆయన ఇబ్బంది పెట్టారు అనే కధనాలు కూడా అప్పట్లో ఎక్కువగా వచ్చాయి. ఇక పత్రికలూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పరోక్షంగా వ్యాఖ్యలు చేసాయి. అయితే ఆయన కారణంగా ఇబ్బంది పడిన వారు ఎవరూ లేరు అని చెప్తుంది టాలీవుడ్. 

 

ఆయన ప్రతిభను పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడమే గాని ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టిన సందర్భం ఎప్పుడు లేదు అని అంటూ ఉంటారు. ఎస్పీ బాలు నుంచి నేర్చుకున్న వారే గాని ఆయన నుంచి నాశనం అయిన వారు ఎవరూ కూడా లేరు అనేది టాలీవుడ్ లో అయినా మరో భాషలో అయినా సరే చెప్పే మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: