అందాలను పిండి ఆరేస్తూ హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్న హాట్ బ్యూటీ...!
ఆదా శర్మ... ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది 'హార్ట్ ఎటాక్' అనే చెప్పాలి. ఈ సినిమాలో నితిన్ సరసన అందాలు ఆరబోస్తూనే తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఏం లాభం సెకండ్ హీరోయిన్ ఛాన్సెస్ మాత్రమే అమ్మడి తలుపు తట్టాయి. అల్లు అర్జున్ తో 'సన్ అఫ్ సత్యమూర్తి' సినిమాలో కూడా నటించింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఆ తర్వాత 'గరం' 'క్షణం' 'కల్కి' చిత్రాల్లో మెరిసింది. అందాలను ఒలకబోసినా తెలుగులో మాత్రం మెయిన్ హీరోయిన్ అవకాశాలైతే రాలేదనే చెప్పాలి. '1920' సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీ మళ్ళీ బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ 'కమాండో 2' 'కమాండో 3' 'చార్లీ చాప్లిన్ 2' 'బైపాస్ రోడ్' వంటి చిత్రాల్లో నటించింది. హిందీలో పలు వెబ్ సిరీస్ లలో నటించిన ఈ అమ్మడుకి బాలీవుడ్ లో అడపాదడపా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఆదాశర్మ తన టిక్ టాక్ వీడియోలను.. వర్క్ అవుట్ వీడియోలను.. ఫోటోలను పోస్టు చేస్తూ కుర్రకారుకి హీట్ పెంచేస్తూ ఉంటుంది. ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ ఇంకొంచెం డోస్ పెంచి ఫొటోస్ పోస్టు చేస్తూ వస్తోంది. అమ్మడు తాజాగా ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు. పల్లెటూరి అమ్మాయిలా చీర కట్టులో బట్టలు ఉతికి ఆరేసింది. అది కూడా కొత్తగా ఎలా బట్టలు ఆరబెట్టాలో చూపిస్తుంది. మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ బట్టలు అలా ఉతికి ఆరేయాలని చెప్తోంది. బట్టల ఉతకడం సంగతి ఎలా ఉన్నా ఈ వీడియోలో ఆదా అందాలు మాత్రం కనువిందు చేస్తున్నాయి. ఆమె అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఆదా మాన్ టూ మాన్ అనే హిందీ చిత్రంలో నటిస్తుంది.
auto 12px; width: 50px;">View this post on InstagramEk ladki ko dekha toh aisa laga - A post shared by {{RelevantDataTitle}}