భార్యకు పెత్తనం ఇచ్చిన బన్నీ ...!
అయితే ఇప్పుడు హీరోలు కథలు వినడం లో చాలా బిజీ అవుతున్నారు. లాక్ డౌన్ కూడా వారికి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇక చేసే సినిమాల కోసం కూడా వాళ్ళు కష్టపడటం అన్నీ కూడా వాళ్లకు క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లో అల్లు అర్జున్ పరిస్థితి అదే అనేది టాక్. అతను వరుస సినిమాలతో బిజీ గా ఉండటంతో తన సినిమాల పారితోషికం, నిర్మాతల వ్యవహారాలూ మొత్తం కూడా భార్య చేతిలో పెట్టాడు అని సమాచారం.
తన సినిమాకు సంబంధించిన హక్కులను కొనాలి అనుకున్నా సరే ఆమెకు చెప్తున్నాడు... అని అంతా ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకి అడుగు వేస్తున్నారు అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. ఇటీవల ఆమె కథ లు కూడా విని బన్నీ కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది అని సమాచారం. చిన్న చిన్న సినిమాలను కూడా కొనే ఆలోచనలో ఆమె ఉన్నారని అప్పుడే త్వరపడవద్దని బన్నీ చెప్పాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. పుష్ప సినిమా వ్యవహారాలూ అన్నీ కూడా ఆమె చూస్తున్నారని సమాచారం. బన్నీ డేట్స్ కూడా ఆమెనే ఇస్తున్నట్టు టాలీవుడ్ జనాల మాట. ఇక మహేష్ బాబు సినిమా వ్యవహారాలు కూడా ఆయన భార్య నమ్రత చూస్తారన్న టాక్ సరేసరి..?