వాళ్ళిద్దరికీ సరైన రీప్లేస్మెంట్ వీళ్ళిద్దరే..... మరి అది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి....!!

GVK Writings

టాలీవుడ్ హిట్ పెయిర్ మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి ల జంట కలిసి నటించిన సినిమాల్లో చాలావరకు మంచి సక్సెస్ సాధించిన సినిమాలే ఉన్నాయి. కాగా వాటిలో కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. జగదేకవీరుడు గా మెగాస్టార్, దివి నుండి భువికి దిగివచ్చిన అతిలోక సుందరి పాత్రలో శ్రీదేవి, ఇద్దరూ కూడా ఒకరిని మించేలా మరొకరు పోటీ పడి ఎంతో అద్భుతంగా నటించడం జరిగింది. ఇళయరాజా అందించిన అద్భుతమైన సాంగ్స్ తో పాటు ఆకట్టుకునే కథ, కథనాలతో సినిమాని ఒక దృశ్య కావ్యంగా మలిచిన దర్శకుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. 

ఇటీవల సక్సెసుల్ గా ఈ సినిమా 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా నిర్మాత అశ్విని దత్ ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, ప్రస్తుతం తమ బ్యానర్ పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా తీయడానికి సిద్ధం అయ్యాము, దాని అనంతరం జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు సీక్వెల్ పై దృష్టి పెట్టడం జరుగుతుందని అన్నారు. టాలీవుడ్ కి చెందిన ఒక ప్రఖ్యాత దర్శకుడు ఈ సినిమా సీక్వెల్ ని తెరకెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

 

ఇకపోతే ఈ సినిమాలో ముఖ్యంగా హీరో, హీరోయిన్ల పాత్రల్లో ఎవరు నటిస్తారు అనే దానిపై కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతుండగా, మెజారిటీ ప్రేక్షకులు అంటున్న దానిని బట్టి ఈ సీక్వెల్ లో హీరో, హీరోయిన్లుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అయితేనే బాగుంటుందని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఎందుకంటే ఆయా పాత్రల్లో వారిద్దరూ అయితేనే సరిగ్గా సరిపోతారని, నిర్మాత దర్శకులు కూడా వారిద్దరిని కనుక ఎంపిక చేసి సినిమా తీస్తే తప్పకుండా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అని పలువురు సినీ అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మెసేజస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా విషయమై ఏమి జరుగుతుందో, హీరో హీరోయిన్లుగా ఎవరు నటిస్తారో తెలియాలంటే మాత్రం ఇంకొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: