హింట్ ఇచ్చి టెంప్ట్ చేస్తున్న విజయ్ దేవరకొండ
మొన్నటికి మొన్న .. అర్జున్ రెడ్డితో తనను స్టార్ హీరోని చేసిన సందీప్ రెడ్డి వంగాకి ఇంట్రస్టింగ్ కామెంట్ పెట్టాడు విజయ్. రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఫౌండేషన్, మిడిల్ క్లాస్ ఫండ్ ని అనౌన్స్ చేసినప్పుడు వెల్ డన్ అని సందీప్ మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు . సందీప్ ట్వీట్ కి .. మిస్ యు వంగా.. ఈ లాక్డౌన్ టైమ్ లో 2, 3 స్క్రిప్ట్ లు రెడీ చెయ్.. నీతో సినిమా చెయ్యడానికి రెండేళ్లు నేను వెయిట్ చెయ్యలేను అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు విజయ్ దేవరకొండ. దాంతో మళ్లీ సందీప్ రెడ్డి కాంబినేషన్లో మరో మ్యాసివ్ మూవీ రాబోతోందని ఫ్యాన్స్ కి ఇప్పటినుంచే ఊరించేస్తున్నాడు విజయ్. ఈ ఇద్దరు డైరెక్టర్ల తో పాటు మరో డైరెక్టర్ శివ నిర్వాణ తో కూడా సినిమా చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. శివ.. టక్ జగదీష్ తర్వత విజయ్ దేవరకొండతోనే సినిమా చేస్తున్నట్టు న్యూస్ వినిపిస్తున్నా.. ఈ వార్తల్ని ఏమాత్రం కొట్టిపారేయట్లేదు విజయ్. అంటే శివ తో విజయ్ సినిమా ఆల్ మోస్ట్ కన్ ఫామే అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు . ఇలా విజయ్ .. చెప్పీ చెప్పనట్టు, హింట్లు ఇస్తూ.. అటు ఆడియన్స్ ని, డైరెక్టర్లనీ ఊరించేస్తున్నాడు విజయ్.
I know one amazing thing WE are going to do together 😁🤗 https://t.co/SJkBwfX3LQ — vijay Deverakonda (@TheDeverakonda) May 10, 2020