ఏపీ:130 సీట్లతో ఆ పార్టీ ప్రభంజనం..!

Divya
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయాల సర్వేలు సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా సర్వేల విషయంలో చాలా మంది నేతలు కూడా ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. రోజుకు ఒక కొత్త సర్వే వల్ల ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ రాష్ట్రాలలో రన్ అవుతున్నాయి.. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా సర్వే విడుదల చేసిన.. ఇప్పుడు వైసీపీ పార్టీకి అనుకూల సర్వేను విడుదల చేయడం జరిగింది. UDC పోర్ట్ సర్వేలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ సీట్లను గెలుచుకుంటుందంటూ తెలియజేశారు.

50.4 % వరకు ఓటింగ్ నమోదు చేసుకుంటుందంటూ తెలియజేస్తున్నారు. టిడిపి జనసేన బిజెపి మాత్రం 42.6% వస్తుందంటూ తెలుపుతోంది. కాంగ్రెస్ కు 2.8 %.. ఇతరులకు 2.8% అంటే తెలియజేశారు.. కాంగ్రెస్ కూటమి కమ్యూనిస్టులతో కలిపి.. మళ్లీ ఇతరులు ఇంకెవరున్నారని.. ఇక్కడ ఈ సర్వే కాస్త కన్ఫ్యూజన్ ని చేస్తోంది. ఈ సర్వే మీద విశ్వసనీయత కాస్త తగ్గుతుందని కూడా చెప్పవచ్చు. అయితే పార్లమెంటు స్థానాలకు సంబంధించి 22 నుంచీ 25 సీట్లు వైసిపి అందుకుంటుందంటూ తెలుపుతోంది.

కూటమిలో భాగంగా రెండు నుంచి మూడు సీట్లు మాత్రమే సంపాదించుకుంటుందని తెలుపుతోంది. అలాగే అసెంబ్లీ సీట్లకు సంబంధించి.. 120 నుంచీ 130 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని.. తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి భాగంగా..45 నుంచి 50 స్థానాలు కైవసం  చేసుకొనే అవకాశం ఉందని.. కాంగ్రెస్ కానీ ఇతరులకు కానీ ఏమీ ఉండదని తెలియజేస్తోంది. యూడీసీ అంచనా ప్రకారం ఈ సర్వేను విడుదల చేయడం జరిగింది. మరి ఇప్పటికే ఎన్నో రకాల సర్వేలు సైతం వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మరికొన్ని పార్టీలు కూటమి అధికారంలోకి వస్తుందంటూ తెలియజేశాయి. కానీ ఎలక్షన్ కి మరో 10 రోజులు సమయం ఉన్నది కనుక ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితులలో ఇప్పుడు ఉన్నది.. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: