ఇక సినిమాలు వద్దనే ఆలోచనలో అనుష్క..!
టాలీవుడ్ లో అడుగు పెట్టి 15 ఏళ్ళు అయినా సరే అనుష్క కెరీర్ మాత్రం ఇప్పుడు దూసుకుపోతుంది. 2005లో పూరి జగన్నాథ్ - నాగార్జున కాంబినేషన్లో వచ్చిన సూపర్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. విచిత్రం ఏంటంటే ఆ సినిమాలో అయేషా టకీయా ఫస్ట్ హీరోయిన్ అయితే.. అనుష్క ది రెండో హీరోయిన్ పాత్ర. ఆమె హీరోయిన్ అయినప్పుడు అసలు ఆమెకు ఫ్యూచర్ ఉంటుందా ? అన్న సందేహాలు చాలా మందికి కలిగాయి. కట్ చేసి చూస్తే అనుష్క సౌత్ లోనే తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఆమె వరుసగా సినిమాలు చేయకపోయినా సరే ఆమె సినిమాల గురించి మాత్రం ఇప్పుడు చాలా చర్చలే జరుగుతున్నాయి. ఆమె సినిమాల కోసం ఇప్పుడు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆమె సోలో గా సినిమాలు చేస్తే వాటికి ప్రత్యేకంగా ఆదరణ అనేది ఉంటుంది అనే మాట వాస్తవం. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలు చేస్తుంది. ఆ సినిమాలు ఎప్పుడు మొదలు పెడుతుందో తెలియదు. అయితే ఆ రెండు సినిమాల తర్వాత ఆమె సినిమాల నుంచి దూరం జరిగే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంది.
ఆమె పెళ్లి చేసుకుని ఇటలీ లేదా వేరే దేశానికి వెళ్లిపోవాలి అని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే వార్తలు మాత్రం భారీగా వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలను కూడా సోలో గానే చేస్తుంది. చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చినా సరే ఆమె వద్దని చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఆమె ఎవరిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అనే మాత్రం స్పష్టంగా తెలియదు. ఆమె సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు కూడా ఇప్పుడు వెనక్కు తగ్గి ఆమెను పక్కన పెట్టారు అని సమాచారం. ఇందుకు కారణం తాను సినిమాలు చేయడం లేదని చెప్పడమే..?