హరికృష్ణ జీవితం లో అన్ని అవమానాలే...

Gullapally Venkatesh

ఎన్టీఆర్ కొడుకు గా మాత్రం నందమూరి హరికృష్ణ పరిమితం కాలేదు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన తండ్రికి అన్ని విధాలుగా అండగా నిలబడిన కొడుకు గా తన తండ్రి కోసం జీవితాన్ని త్యాగం చేసిన కొడుకు గా చిన్న చిన్న ఆనందాలు వదులుకున్న కొడుకు గా ఎన్నో ఎన్నో ఆయన జీవితంలో కనపడుతూ ఉంటాయి. తండ్రి స్థాపించిన పార్టీ కోసం ఆయన కష్టపడిన విధానం నుంచి ఆయన చేసిన సేవ కూడా ఒక సంచలనం అనే చెప్పవచ్చు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ నేడు ఇలా ఉంది అంటే ఆయన వేసిన పునాది. 

 

అయితే ఆయన జీవితంలో ఎక్కువగా అవమానాలు విషాదాలు ఎదుర్కొన్నారు అని చెప్తూ ఉంటారు. ఆయన జీవితంలో ఎక్కువగా వాటి తో సావాసం చేసారు అని అంటారు. తన తండ్రి కోసం ఆయన చాలా సన్నివేశాలు జీవితంలో ఎదుర్కొన్నారు అని తనను తాను చాలా సంతోషంగా కోల్పోయారు అని అంటారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఉన్న చంద్రబాబు నుంచి తెరాస కాంగ్రెస్ వైసీపీలో నాయకులు గా ఉన్న వారిలో చాలా మంది నేతలు ఆయన కింద రాజకీయం నేర్చుకున్న వాళ్ళే. ఆయనను చూసి నాయకులు గా అయిన వాళ్ళే. 

 

రాజకీయం తో పాటుగా నిజ జీవితంలో కూడా తండ్రి కి ఒక కొడుకు ఏ విధంగా ఉపయోగపడతాడు ఒక తండ్రి కోసం కొడుకు ఏ త్యాగం చేయవచ్చు అనడానికి హరికృష్ణను కు చూపించవచ్చు అని చెప్పవచ్చు. ఇక హరికృష్ణ జీవితం ముగిసిన విధానం ఒక విషాదం. ఆయన కారు ప్రమాదం మాత్రం నిజం గా ఇప్పటికి ఎవరూ కూడా మరువలేరు అనే చెప్పవచ్చు. ఆ విధంగా జరిగింది ఆ కారు ప్రమాదం. హరికృష్ణ జీవితం ఏ రోజు కూడా సుఖపడింది కూడా కాదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: