ప్రభుత్వాలు మారినా ప్రజా సమస్యలు తగ్గట్లేదుగా?

Purushottham Vinay
•తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినా తగ్గని ప్రజా సమస్యలు
•హామీలు ఎక్కువ  పనులు తక్కువ
•హామీలు నెరవేరక ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగులు


ఇండియా హెరాల్డ్, ఏపీ - తెలంగాణ:  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా కూడా ఆ సమస్యలు అంతే ఉండిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాలు చాలా వరకు వెనకబడిపోయాయి.ముఖ్యంగా రూరల్ ఏరియాలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. కొన్ని చోట్ల కనీస, విద్యా, వైద్య సదుపాయాలు కూడా లేని పరిస్థితి.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు చెయ్యలేదు. చాలా మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక నోటిఫికేషన్స్ పడక చాలా అవస్థలుపడుతున్నారు. కొంతమంది ఉద్యోగాలు లేక ఇల్లు గడవక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు.తాజా రేవంత్ ప్రభుత్వంలో కూడా పరిస్థితి మారట్లేదు.


అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా చెప్పుకుంటే చాలా సమస్యలు పీడిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి కాక రైతులు అల్లాడి పోతున్నారు. అలాగే బీటెక్, టీచింగ్ కోర్సులు చేసిన వారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కూడా ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర లోని కొన్ని జిల్లాల్లో పనులు లేక సామాన్యులు పేదరికంతో అల్లాడిపోతున్నారు. ప్రకాశం లాంటి వెనకబడిన జిల్లాల్లో సరైన విద్యా, వైద్య సదుపాయాలు లేక జనాలు అవస్థలు పడుతున్నారు. చాలా మంది పేదవాళ్లు ఇళ్ళులు లేక రోడ్డున పడుతున్నారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో నాణ్యమైన వైద్యం లేక డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చాలా మంది సామాన్యులు చనిపోతున్నారు. వీటి గురించి అధికారులకి చెప్పినా కూడా పట్టించుకోట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది యువతి యువకులు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ పడక, కంపెనీలు కేక నిరుద్యోగులుగా మిగిలిపోతూ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. అక్కడ చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. రైతులకు గిట్టు బాటు ధరలు ఉండట్లేదు. ప్రభుత్వాలు మారినా సామాన్యుల సమస్యలు మాత్రం మారట్లేదు. జగన్, చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఇలా జనాలు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమయం కావడం వల్ల అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హామీలు ఇస్తున్నారు. మరి అధికారంలోకి వచ్చాక వాటిని ఈసారైనా అమలు చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: