'ఈ పరిస్థితికి మనమే కారణం.. ధైర్యంగా ఎదుర్కొందాం' అంటున్న బాలీవుడ్ బ్యూటీ

Murali

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎంతోమందిని బలి తీసుకుంటోంది. అంతకంటే ముఖ్యంగా ప్రజలందరిలో భయాన్ని పుట్టిస్తోంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైన ఈ సమయంలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటికి తోడు ఎందరో సెలబ్రిటీలు ఈ విపత్తు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ కూడా తన వంతు బాధ్యతగా ప్రజలంతా ధైర్యంగా ఉండాలని చెప్తోంది. ఇందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ తో ఆన్ లైన్ లో మెడిటేషన్ తో ధైర్యంగా ఎలా ఉండొచ్చనే విలువైన సలహాలు తీసుకుంది.

 

‘ఇటువంటి విపత్కర సమయాల్లోనే మనం ఎంత దైర్యంగా ఉండాలో తెలుస్తుంది. మనలోని ఆధ్యాత్మికతను కూడా బయటకు తీసుకురావాల్సిన సమయం ఇదే. మన జీవితంలో వివిధ సందర్భాల్లో కొన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటాం. ఈ సమయంలో మానసికంగా ధృడంగా ఉండటం ఎంతో ముఖ్యం. మానసికంగా బలంగా ఉండటం ఎంతో ముఖ్యం. గురు రవిశంకర్ మాటల ద్వారా మనం ప్రకృతిని ఎంత ప్రేమించాలో ఎంతగా కాపాడుకోవాలో తెలుస్తోంది. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక కూడా ఒక బాధ్యాతాయుతమైన పౌరుడిగా మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దానిపై ఒక అవగాహన వస్తుందని భావిస్తున్నాను. ఇలాంటి సమయాల్లో గురు రవిశంకర్ చెప్పే విలువైన సలహాలు ఎంతో ఉపయోగపడతాయి’ అంటూ విలువైన సలహాలు చెప్తోంది.

 

భూమి ఫడ్నేకర్ నటిగానే కాకుండా పర్యావరణం పరిరక్షణకు పాటుపడుతూ ఉంటుంది. పర్యావరణంపై సమాజంలో తన వాదన వినిపిస్తూ ఉంటుంది. ప్రకృతిని కాపాడుకోవటం, విపరీతమైన కాలుష్యం వల్ల భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలపై ప్రజల్లో చైతన్యం కల్పస్తూ ఉంటుంది. పర్యావరణ ప్రేమికురాలిగా తన వంతు బాధ్యత నెరవేరుస్తోంది. గురు రవిశంకర్ తో ఈ విషయాలన్నింటిపై పలు సలహాలు తీసుకున్న భూమి ఫడ్నేకర్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
It’s an absolute honour for me to be speaking with Gurudev @srisriravishankar Ji at 7 pm today about life in the times of COVID - 19 , mental {{RelevantDataTitle}}