'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్ కొమరం భీం లుక్ రిలీజ్ ...పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్...??
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. ఇటీవల ఈ సినిమాకు రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ఎన్ని కన్ఫర్మ్ చేసారు సినిమా యూనిట్ సభ్యులు. ఆ తరువాత ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా కొమరం భీం పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ చేతుల మీదుగా, రామ్ చరణ్ పోస్తిస్తున్న అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ వీడియో ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాగా దానికి ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ నుండి కూడా విపరీతమైన స్పందన లభించింది.
మరి రామ్ చరణ్ బర్త్ డే రోజున ఎన్టీఆర్ తో ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేయించిన రాజమౌళి, రాబోయే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండడంతో ఆ సమయంలో రామ్ చరణ్ చేతుల మీదుగా ఎన్టీఆర్ కొమరం భీం లుక్ రిలీజ్ చేయించడం ఖాయం అంటూ ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే నేడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి కొమరం భీం లుక్ పోస్టర్ ఒకటి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఆ పోస్టర్ ని చూసి ముందుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా అది ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి వచ్చిన అఫీషియల్ పోస్టర్ అని అనుకున్నారు.
కాగా ఆ తరువాత అది కేవలం ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని అందరికీ అర్ధం అయింది. తమ అభిమాన హీరో పుట్టినరోజుకు మరొక 37 రోజుల సమయం ఉండడంతో ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ ఆ పోస్టర్ ని ఎంతో ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. కాగా ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ మాత్రం అదిరిపోయింది అనే చెప్పాలి. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు ముగించి ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 8 న రిలీజ్ చేయనున్నారు....!!