ఆయనే నా ఫస్ట్ క్రష్.... ఆయనంటే చచ్చేంత ఇష్టం అంటున్న ఐటమ్ భామ.....!!!

GVK Writings

రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చారు సూపర్ స్టార్ కృష్ణ తనయుడైన నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు. ముందుగా బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్న మహేష్, హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ రాజకుమారుడుతో బెస్ట్ హిట్ అందుకొని ఘట్టమనేని ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించారు. ఇక ఆ తర్వాత నుండి వరుసగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ అద్భుతమైన తన నటనా టాలెంట్ తో ముందుకు సాగిన మహేష్, ఆపై తన సినీ జీవితంలో ఎందరో అభిమానులను, విపరీతమైన క్రేజ్ ని, మార్కెట్ ని సంపాదించడం జరిగింది. 

మన టాలీవుడ్ సహా పలు ఇతర భాషల్లో కూడా మహేష్ బాబుకి విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా అమ్మాయిలతో పాటు పలువురు హీరోయిన్లలో కూడా మహేష్ కి చాలా మంది అభిమానులు ఉన్నారని చెప్పాలి. ఇక బాలీవుడ్ హీరోయిన్లలో చాలావరకు కూడా మహేష్ అంటే అమితంగా ఇష్టపడే వారు ఎక్కువ. ఇకపోతే టాలీవుడ్ ఐటం భామ అయిన హంసనందిని, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను దాదాపుగా అందరు తెలుగు స్టార్ హీరోల సరసన నటించానని, అయితే తనకు ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించే ఛాన్స్ ఇప్పటివరకు రాలేదని, ఆయనతో కలిసి నటించే ఒక్క సీన్ అయినా తనకి చాలని హంసనందిని అన్నారు. 

 

నిజానికి తన ఫస్ట్ క్రష్ మహేష్ అని, పోకిరి సినిమాతో ఆయనకు వీరాభిమానిగా మారిపోయిన తనకు ఆయన అంటే ఎంత అభిమానం ఉందో మాటల్లో చెప్పలేనని అన్నారు. ఎప్పటినుండో మహేష్ ప్రక్కన నటించాలని కోరుకుంటున్న తనకు, మరి ఆ అవకాశం ఎప్పుడు లభిస్తుందో చూడాలని, ఒకవేళ ఆ అవకాశం వస్తే నిజంగా అది తన అదృష్టం అని హంసనందిని మహేష్ పై ఉన్న తన అభిమానాన్ని వెలిబుచ్చారు.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: