వాయిస్‌ ఓవర్‌కి కూడా రిజెక్ట్ అయిన స్టార్‌ కిడ్!

JSR
తొలి సినిమా స్టూడెంట్ ఆఫ్‌ ద ఇయర్‌ తోనే భారీ హైప్‌ క్రియేట్ చేసిన అందాల భామ అనన్య పాండే. ఆ సినిమాలో ఆమె లుక్‌, నటనకు ఆడియన్స్‌తో పాటు సినీ విమర్శకుల నుంచి కూడా అదిరిపోయే రెస్సాన్స్ వచ్చింది. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన హాట్ బ్యూటీ అనన్య ఇండస్ట్రీలోకి తాను ఎంట్రీ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలపై స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా మీ ఫస్ట్ ఆడిషన్ గుర్తుందా అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది అనన్య.

`నాకు బాగా గుర్తుంది అలాద్దీన్‌ ఇండియాకు వచ్చినప్పుడు చాలా మంది ఆడిషన్స్‌కు వెళ్లారు. నేను కూడా వెళ్లాను. ఆడిషన్ కోసం ఓ వీడియో రికార్డ్ చేసి పంపాలి. నేను నా ఫోన్‌తో వీడియో రికార్డ్ చేశా. ఆ రోజు రెడ్‌ కలర్‌ డ్రెస్‌ వేసుకున్నా. నేను జాస్మిన్ క్యారెక్టర్ డైలాగ్స్ చెప్పి వినిపించాను. చాలా బాగా వచ్చింది. కానీ వాళ్లు నేను పాట కూడా పాడలని అడిగారు. కానీ పాట పాడటానికి అంగీకరించలేదు. దీంతో వాళ్లు నన్ను రిజెక్ట్ చేశారు`.

ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇషాన్‌ ఖట్టర్‌ హీరోగా తెరకెక్కుతున్న ఖాలీ పీలి సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది అనన్య, ఈ సినిమాతో పాటు శకున్‌ బాత్రా దర్శకత్వం వహిస్తున్న సినిమాతో సిద్ధాంత్‌ చతుర్వేది, దీపికా పదుకొనే లతో కలిసి నటిస్తోంది. అంతేకాదు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలోనూ నటిస్తోంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
all dressed {{RelevantDataTitle}}