వావ్ అద్భుతం, దుమ్ము లేపారు....మాలో ఉత్సాహం నింపారు.....!!
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా రౌద్రం రణం రుధిరం సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ తరువాత ఆ సినిమాపై విపరీతంగా అంచనాలు పెరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా నేడు, ఇందులో మరొక హీరోగా కొమరం భీం పాత్రలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి పాత్ర పరిచయానికి సంబంధించి ఒక వీడియో ని యూట్యూబ్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
మా అన్న, మన్యం దొర, ఇంటిపేరు అల్లూరి, సాకింది గోదారి అంటూ ఎన్టీఆర్ పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్స్ తో పాటు రామ్ చరణ్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రస్తుతం ఆ వీడియో టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతుండగా పలువురు ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రముఖులు కూడా ఆ వీడియో పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కాసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, వావ్ అద్భుతంగా ఉంది అల్లూరి సీతారామరాజు టీజర్. ఈ టీజర్ తో దుమ్ము రేపి, మాలో మరింత ఉత్సాహం నింపారు. తారక్ తన బ్రదర్ చరణ్ కి మంచి గిఫ్ట్ ఇచ్చాడు అంటూ మెగాస్టార్ ఆ వీడియో పై తనదైన శైలిలో పొగుడుతూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది.
అయితే ఆయన పోస్ట్ పై స్పందించిన దర్శకుడు రాజమౌళి, మీలాంటి గొప్ప వ్యక్తి మా మూవీ వీడియో ని మెచ్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తుండగా, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని, అలానే రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీగా నిర్మితం అవుతున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 8 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.....!!
#BheemforRamaraju
Adirindi...@ssrajamouli
మీ అంబులపొది లోంచి వదిలిన రామబాణం ఈ సీతారామరాజు
Amogham...@tarak9999
Dummu leparu..
Maalo utsahanni nimparu..
దుమ్ములేపారు...మాలో ఉత్సాహాన్ని నింపారు
Memorable birthday surprise from #Taarak@AlwaysRamcharan#HBDRamcharan https://t.co/fN2jRFFnR4 — chiranjeevi konidela (@KChiruTweets) March 27, 2020