జగపతి 25 ఏళ్ల ప్రస్థానం...

Seetha Sailaja
హీరోగా 25 ఏళ్ల కెరియర్ ఏడు నంది అవార్డులు, ఎన్నో విభిన్నమైన పాత్రలు. అందాల నటుడు శోభన్బాబు తరువాత ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఇవన్నీ ఒక్క జగపతిబాబుకు తప్ప మరే హీరోకి సొంతం కాలేదు. కథానాయకునిగా పాతికేళ్లు కనిపించిన జగపతి ప్రస్తుతం మారుతున్న కాలంలో తాను కూడ మారి ఇప్పుడు ప్రతినాయకునిగా మారాడు. తన పాత్రలతో ఎన్నో ప్రయోగాలు చేసిన జగపతిబాబు పుట్టినరోజు నేడు. మాటను కాదు నోటుని నమ్మాల్సి వస్తోంది అని అంటున్న జగపతిబాబుచాల వేదాంతిలా మారాడా అనిపిస్తోంది.  ప్రస్తుతం అందరి జీవితం డబ్బు చుట్టూ తిరుగుతోందని చెపుతూ తాను విలన్ గా సినిమాలలో ప్రారంభిస్తున్న సెకండ్ ఇన్నింగ్స్ డబ్బు కోసం తన కుటుంబ సభ్యుల కోసం అని అంటున్నాడు. ఒక్క సినిమా చేస్తే చాలు అని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జగపతి వంద సినిమాలు చేశాడు. 25ఏళ్లుగా నటుడిగా కొనసాగుతున్నాడు. టాలీవుడ్ బెస్ట్ డెరైక్టర్స్‌తో సినిమాలు చేశాడు. బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాలో విలన్ గా తన సెకండ్ ఎంట్రీని ఖరార్ చేసుకున్న జగపతి విలన్ లుక్ కు సంబంధించిన స్టిల్స్ ఈరోజు ‘లెజెండ్’ టీమ్ బయట పెట్టింది. డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న జగపతిబాబు ప్రస్తుతం టాలీవుడ్ ను పీడిస్తున్న విలన్ల కొరత సమస్యకు పరిష్కారం చూపే స్థాయిలోనే ఉన్నాయి జగపతి లుక్స్. శ్రీహరి మరణంతో ఖాళీ అయిన ఆయన స్థానాన్ని జగపతిబాబు విలన్ గా క్యారెక్టర్ యాక్టర్ గా పూరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని అంటున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ‘లెజెండ్’ జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ పై ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: