క్వారెంటైన్‌ టైం... భార్య సేవలో టాప్‌ స్టార్‌

JSR
ప్రస్తుతం కరోనా భయంతో ప్రజలంతా ఇంటికే పరిమితమవుతున్నారు. సాధారణ ప్రజానీకంతో పాటు సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమిత మవుతున్నారు. ఈ నేపథ్యంలో వారు ఇంట్లో ఆసక్తికర పనులు చేస్తూ తమ అభిమానులను అలరిస్తున్నారు. అయితే ప్రతీ విషయంలోనూ తన రూటే సపరేటు అనిపించుకునే కలెక్షన్‌ కింగ్ మోహన్‌ బాబు ఈ విషయంలోనూ తన స్టైల్‌ లో స్పందించాడు. ఇండస్ట్రీలో మోహన్‌ బాబు అంటే అందరికీ కాస్త భయంతో కూడిన భక్తి అన్న విషయం అందరికీ తెలిసిందే.


ఆయనతో ఎదురుపడి మాట్లాడేందుకు కూడా జంకుతారు. అలాంటిది ఆయనే సేవ చేస్తూ కనిపించే సరికి అభిమానులు షాక్‌ అయ్యారు. ఈ ఆసక్తికర వీడియోను మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ లో పోస్ట్ చేశాడు. మోహన్‌ బాబు తన భార్య పడుకుంటే ఆ పక్కనే నిలబడి ఆమెకు గాలి విసురుతున్నాడు మోహన్‌ బాబు. ఈ వీడియోను పోస్ట్ చేసిన మనోజ్‌ `ప్రియమైన మగాళ్లు.. ఇది మీరు వాళ్లకు తిరిగి ఇచ్చేయాల్సిన సమయం. ఇలాగే మీరు కూడా వీడియో తీసి మై క్వారెంటైన్‌ టైం (#MyQuanrantineTime) అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేయండి అంటూ పోస్ట్ చేశాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న మోహన్‌ బాబు, సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఆకాశమే నీ హద్దురా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక మనోజ్‌ విషయానికి వస్తే చాలా కాలం తరువాత అహం బ్రహ్మాస్మి అనే సినిమాను స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్నాడు మనోజ్‌.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
‪😍❤️🏡‬ ‪Dear men, this is your chance to give them back what they deserve 😜 make a video and ‬ ‪Share your lovely quarantine moment with the hashtag #MyQuarantineTime‬ ‪& prove that we can enjoy staying at {{RelevantDataTitle}}