ఈ ఏడాది నీ భర్తను కనిపెట్టేద్దాం.. అప్పటి వరకు అన్వేషిద్దాం: యంగ్ హీరో

JSR
వరుసగా యాక్షన్ సినిమాలో బాలీవుడ్‌ ను షేక్‌ చేస్తున్న యంగ్ హీరో టైగర్‌ ష్రాఫ్‌. సీనియర్‌ నటుడు జాకీ ష్రాఫ్ వారసుడిగా బాలీవుడ్‌కు పరిచయం అయిన టైగర్‌ తనదైన స్టైల్‌ లో దూసుకుపోతున్నాడు. యాక్షన్, డ్యాన్స్ లతో వావ్‌ అనిపిస్తూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సాధించుకున్నాడు. చేసేది యాక్షన్‌ సినిమాలే అయినా టైగర్‌ కామెడీ టైమింగ్ కూడా సూపర్బ్‌ గా ఉంటుంది. సినిమాల్లోనే కాదు సోషల్‌ మీడియాలోనూ తనదైన స్టైల్‌ లో స్పందిస్తుంటాడు ఈ యంగ్ హీరో.

తాజాగా మరో ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశాడు టైగర్‌. తన మేనేజర్‌ ఇషా గోరక్ష పుట్టిన రోజు సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఫన్నీ పోస్ట్ తో శుభాకాంక్షలు తెలియజేశాడు. `ఎప్పుడూ నీ వెన్నంటి ఉంటా కిడ్డో.. నా మేనేజర్‌, మాన్సటర్‌, బాడీ గార్డ్‌, ట్రైనింగ్ పార్టనర్‌, ఫుడ్‌ గైడ్‌ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. బాదపడకు ఈ ఏడాది నీ భర్తను పట్టుకుందాం. సరైన వాడు దొరికే వరకు అన్వేషిద్దాం` అంటూ కామెంట్  చేశాడు టైగర్‌.

ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల భాగీ 3తో మరో సూపర్‌ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న టైగర్‌ ష్రాఫ్‌, ప్రస్తుతం హీరో పంతి2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అహ్మద్‌ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా యాక్షన్‌ జానర్‌ లోనే రూపొందుతుంది. సినిమాలతో పాటు పలు మ్యూజిక్‌ వీడియోస్‌ లోనూ సందడి  చేస్తున్నాడు టైగర్‌.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Always got your back kiddo❤️happy birthday to my manager/monster/bodyguard/training partner/food-guide. Dont worry we will find your {{RelevantDataTitle}}