అనుష్క (స్వీటీ) అందం అభినయం గల హీరోయిన్. క్రియేటివ్ డైరెక్టర్ పూరిజగన్నాధ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా `సూపర్` చిత్రంలో హీరోయిన్గా పరిచయమైన భామ అనుష్క. ఈ భామ సూపర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై సూపర్‌గా దూసుకుపోతుందని చెప్పాలి. ఇక ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ చిత్రాలంటే కాస్త విజయశాంతి పేరు చెప్పుకునేవారు. హీరోలకి ధీటుగా నటించేది విజయశాంతి. ఆ తర్వాత అంతటి ఘట్స్ ఉన్న హీరోయిన్ అంటే ఇప్పుడున్న దర్శకులకి లేడీ ఓరియంటెడ్ మూవీస్ అంటే చాలు ముందు గుర్తుకు వచ్చేది అనుష్క అని చెప్పాలి.
కత్తి యుద్ధాలు చేసినా...గుర్రమెక్కి స్వారీ చేసినా హీరోలకి ధీటుగా నిలబడ గల ఏకైక హీరోయిన్ అనుష్క. ఈ భామ అందం హైట్, వెయిట్ కరెక్ట్‌గా సరిపోతాయి. ఏ పాత్ర చేసినా ఆ పాత్ర ఆమె కోసమే పుట్టిందేమో అన్నంతలా పాత్రలో లీనమైపోయిమరి పోషిస్తుంది అనుష్క. ఇకపోతే మరికొంత మంది లేడి ఓరియంటెడ్ పాత్రల్లో నటించినప్పటికీ అనుష్క తర్వాతే ఎవరైనా దని చెప్పాలి. ఆమె నటన అంతలా ఆకట్టుకుంటది. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన `అరుంధతి` చిత్రం తర్వాత ఎవరైనా కాస్త గ్రాఫిక్స్ పెట్టి కత్తి యుద్ధాలు చేయించి ఇలాంటి ఛాలెంజ్ పాత్రలు ఏవైనా ఉన్నాయంటే అది అనుష్క అయితేనే బావుంటుందని ఆ చిత్రం తర్వాత దర్శకులు ఫిక్స్ అయిపోయారు. అలా అరుంధతి తర్వాత వచ్చిన చిత్రం `రుద్రమదేవి` అని చెప్పాలి.
కాని ఆశించినంత ఫలితం రాలేనప్పటికీ పర్వాలేదనిపించుకుంది. ఇక హీరోలతో పాటు ధీటుగా ఆమె కూడా రెమ్యూనరేషన్ తీసుకునేది. ఇక ఒక యాడ్ ఫిల్మ్ కోసం కోటిరూపాయలు ఆమె ఏమాత్రం డిమాండ్ చెయ్యకుండా తీసుకున్న ఒకే ఒక్క హీరోయన్ అనుష్క అని చెప్పాలి. అంటే అలాంటి యాడ్స్‌కి అంత రేంజ్లో ఒక టాప్ తీసుకునే రెమ్యూనరేషన్ అంత రెమ్యూనరేషన్ అనుష్క తప్ప మరే హీరోయిన్ తీసుకోలేదనే చెప్పాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: