చావు అంచుల వరకు వెళ్లి వచ్చా.. ఆ దేవుడే రక్షించాడు.. నటి ఆవేదన

siri Madhukar

ఫిలిప్పీన్స్‌లో పుట్టి... ఆ దేశంతోపాటూ... చైనాలో కూడా సినిమా నటిగా, సింగర్‌గా, రికార్డింగ్ ఆర్టిస్టుగా, టీవీ హోస్టుగా గుర్తింపు పొందింది కిమ్ చియు.   2006లో టీవీ తెరపై నటనతో అందర్నీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ తర్వాత సినిమాల్లో ఛాన్సు దక్కించుకుంది. చైనాలో ఆమెను చినితా ప్రిన్సెస్ (చైనా యువరాణి) అంటారు. ఈ బిరుదు సంపాదించుకోవడానికి కిమ్ చియు ఎంతో కష్టపడింది. బుల్లిరపై, వెండి తెరపై తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది.  2006 నుంచీ 12 ఏళ్లలో 17 సినిమాలు, ఎన్నో టీవీ షోలు చేసింది.  దాంతో ఈమె పేరు అక్కడ బాగా పాపులర్ అయ్యింది.  సాధారణంగా ఎవరికైనా పాపులారిటీ వస్తే.. వారికి రక్షణ విషయంలో జాగ్రత్తలు ఉండాల్సిన అవసరం ఉంటుంది.

 

 మనం ఎంత గొప్ప పేరు సంపాదిస్తామో.. అంతే శత్రువులను కూడా కొని తెచ్చుకున్నట్లు ఉంటుందని అంటారు.  ఆ మద్య కిమ్ చియు కారులో ప్రయాణిస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు ప్రారంభించారు. అప్పటికే ఆ కారు అద్దాల ధ్వంసం అయ్యాయి.. కారు పక్కవైపు బుల్లెల్లు దిగాయి.  ఈ దారుణమైన సంఘటన కొన్ని రోజుల క్రితం ఈ   జరగగా కిమ్ చియు సోషల్ స్పందించింది. చాలా మంది నాకు జరిగిన ప్రమాదం గురించి ఫోన్లు చేసి బాగున్నావా అని అడుగుతున్నారు.

 

ప్రమాదం గురించి నేనిప్పుడే ఏమీ మాట్లాడలేను. కానీ ఆ దేవుడి దయ వల్లే బతికి బయటపడ్డాం అని చెప్పింది.  అయితే కారు లో నాతో పాటు డ్రైవర్, మేనేజర్ లు ఉన్నారు.  దేవుడి దయవల్ల అందరం బతికి బయట పడ్డాం. అయితే కాల్పులు జరిపింది ఎవరు అన్న విషయం ఆలోచింసే సమయం లేదు.. టెన్షన్ లో ఉండిపోయాం అని అన్నారు. ఈ సంఘటన క్యూజొన్ నగరంలో జరిగింది. దీనిపై ఫిలిప్పీన్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
A lot of you have been texting and calling. can’t answer right now. Thank you for checking on me. Means a lot. Yes I am safe po. I’m ok and my P.A. And my {{RelevantDataTitle}}