మళ్లీ వివాదంలో సమంత

shami
సమంత ఏ మాయ చేసావే సినిమాతోనే మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కాని ఈ మధ్య సమంత వివాదాలు తలెత్తేలా మాటలు మాట్లాడుతుంది. ఆ మధ్య 1 సినిమా పోస్టర్ పై గొడవ చేసింది. ఆ తర్వాత రభస సినిమా గురించి ఏదో ట్వీట్ చేసింది. రీసెంట్ గా మొన్నీమధ్య హీరోయిన్ల మీద సెటైర్ వేసింది.   ఇప్పుడు కొత్తగా మరళ తను తమిళ్ లో సూర్య తో నటిస్తున్న సినిమా పోస్టర్ గురించి వివాదాస్పదమయ్యేలా ట్వీట్ చేసింది. ఇంతకీ సమంత ఏమని ట్వీట్ చేసిందంటే.. రీసెంట్ గా సూర్య సమంత జంటగా నటిస్తూ లింగుసామి డైరక్షన్ లో వస్తున్న అంజాన్ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో కేవలం సూర్య ని మాత్రమే చూపించారు డైరక్టర్ లింగుసామి. ఆ పోస్టర్ చూసి సమంత్ సినిమాలో హీరోయిన్లకు ఎక్కడ ఇంపాటెన్స్ ఉండదు. హీరోలదే మొత్తం హవా టాలీవుడ్ లో.. కోలీవుడ్ లో.. ఇదే పరిస్తితి అని ట్విట్టర్ లో పెట్టింది.   ఇది చూసిన ఆడియెన్స్ సమంత ఉన్నదానికి లేనిదానికి ఎందుకు ఇలా చీప్ గా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటున్నారు. ఏదో కొద్దిగా చేస్తున్న సినిమాలన్ని హిట్ అవుతున్నాయని అని ఇలా మాట్లాడితే అభిమానులను దూరమవ్వాల్సి వస్తుందని అనుకుంటున్నారు సినీవర్గాలు.     సమంత కామెంట్ల పై మీ స్పందన..?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: