మహేష్ - పరశురామ్ మూవీ ఓపెనింగ్ డేట్ ఫిక్స్...??

GVK Writings

టాలీవుడ్ నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ విషయమై పలువురు దర్శకుల నుండి కథలు వినే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే వరుసగా మూడు సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన సూపర్ స్టార్, నెక్స్ట్ సినిమాతో కూడా మరొక విజయం అందుకునేలా ఎంతో ఆచితూచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారని వినికిడి. నిజానికి తన 27వ సినిమాని మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లితో మహేష్ చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమా కథ తాలూకు స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం కాకపోవడంతో అది కొంత వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. 

 

ఇక అదే సమయంలో గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల చెప్పిన ఒక అద్బుతమైన స్టోరీ తనకు ఎంతో నచ్చడంతో వెంటనే చేయడానికి సిద్ధం అయ్యారట మహేష్. ఈ విషయమై ఇప్పటికే ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసినట్లు టాలీవుడ్ లో గట్టిగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అలానే దానితో పాటు మధ్యలో మెగాస్టార్, కొరటాల సినిమాలో ఒక కీలక పాత్ర చేయనున్న మహేష్, పరశురామ్ సినిమాలో చేయబోయే క్యారెక్టర్ కోసం ఇప్పటినుండే తనను తాను అన్ని విధాలా ఆపాత్ర కోసం సిద్ధం చేసుకునేందుకు రెడీ అయ్యారట. కాగా ఆ సినిమాలో మహేష్ క్యారెక్టర్ నిజంగా ఎంతో ఫ్రెష్ ఫీల్ తో ఉంటుందని, ఆయన తన కెరీర్ లో అటువంటి పాత్ర ఇప్పటివరకు చేయలేదని అంటున్నారు. 
పక్కా ఫ్యామిలీ మూవీ గా మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు పలు కమర్షియల్ హంగులను కలగలిపి ఈ సినిమాని పరశురామ్ తెరేక్కించనున్నట్లు టాక్.

 

టాలీవుడ్ లోని ఒక స్టార్ హీరోయిన్ ని ఇప్పటికే మహేష్ ప్రక్కన నటింపచేసేందుకు అప్పుడే పరశురామ్ ప్రయత్నాలు మొదలెట్టారని, ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు ఉగాది రోజున ప్రకటిస్తారని, వీలైతే అదే రోజున సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండనుందని అంటున్నారు. ఇక సినిమాలోని ఇతర నటీనలు, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా అదే రోజున తెలియనున్నాయట.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: