ఆ విషయంలో మాత్రం, టాలీవుడ్‌ నుండి మొదటి కోటి, సూపర్ స్టార్ మహేష్‌ బాబుదే..!

Suma Kallamadi

ఎల్లప్పుడు బిజీగా ఉండే మన సినీ తారలు.. అప్పుడప్పుడు తమ అభిమానులను సంతోషపరుచుటకు సోషల్ మీడియాలో వారిని వివిధ రకాల పోస్టులతో పలకరిస్తూ ఉంటారు. ఇపుడు సుమారుగా అందరు సెలబ్రెటిస్ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఇలా దాదాపు అందరు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఉంటున్నారు. 

 

అందులో తమ సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ విషయాలను, తమ వ్యక్తిగత విషయాలను మరియు వీడియోలను షేర్‌ చేసుకునేందుకు వారు సోషల్‌ మీడియాను  ఆశ్రయిస్తున్నారు. స్టార్స్‌ కూడా ఎక్కువగా ట్విట్టర్‌లో సందడి చేస్తూ ఉంటారనేది అందరికి విదితమే. ఇక్కడ ఎక్కువగా తమ సినిమాలకు సంబంధించిన విషయాలను వారు షేర్‌ చేసుకుంటూ ఉంటారు. 

 

అయితే మన సూపర్ స్టార్ మహేష్‌ బాబు మాత్రం కొంచెం అరుదుగానే ట్వీట్స్‌ చేస్తూ ఉంటాడని చెప్పాలి. అయినా కూడా ఆయనకు ట్విట్టర్‌ లో ఏకంగా తొమ్మిది  మిలియన్‌ ల ఫాలోవర్స్‌ ఉన్నారంటే ఎవరికి నమ్మ సఖ్యం కాదేమో. కానీ నమ్మి తీరాల్సిందే... ఇక ఈ స్థాయిలో ఫాలోయింగ్ టాలీవుడ్‌ లో వేరొక స్టార్‌ హీరోకు కూడా లేదని విశ్లేషణ. మూడు నాలుగు మిలియన్‌ లు మించి ఫాలోయింగ్ వేరొక హీరోలకు లేదని సమాచారం. టాలీవుడ్‌ స్టార్స్‌ లో ట్విట్టర్‌ లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్నది మా మహేష్‌ బాబుకే అని అభిమానులు  చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.

 

టాలీవుడ్ లో ఎంత మంది స్టార్స్‌ ఉన్నా కూడా అందరికంటే కూడా మహేష్‌బాబు ముందంజలో ఉన్నాడు ఈ విషయంలో. మరో మిలియన్‌ మంది ఫాలోవర్స్‌ ను దక్కించుకుంటే మహేష్‌బాబు కోటి జాబితాలో చేరిపోతాడని అభిమానుల ఆత్రుత. ఇక బాలీవుడ్‌ లో మాత్రమే వున్న ఈ ఫాలోయింగ్ కౌంట్ ను త్వరలో మన సూపర్ స్టార్ చేజిక్కుంచుకుంటాడని సదరు అభిమాన సంఘాలు పండగ చేసుకుంటున్నాయి. ఇక చూడాలి మరి... మన మహేష్ ఏనాటికి ఆ మార్క్ సాధిస్తాడనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: