వామ్మో, అది యాడా.??... యాక్షన్ మూవీ సీన్ రేంజ్ లో తీశారుగా....!!

GVK Writings

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, కొద్దిరోజుల క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఆ సినిమాలో మహేష్ ఒక ఆర్మీ మేజర్ పాత్రలో నటించి మెప్పించారు. ఇకపోతే ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు పలు రకాల ఉత్పత్తుల యాడ్స్ లో కూడా మహేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ముఖ్యంగా వోగ్, థమ్స్ అప్, లాయిడ్, సంతూర్, యప్ టీవీ వంటి ప్రముఖ బ్రాండ్లున్నాయి. 

 

కాగా కొన్నేళ్ల క్రితం నుండి వరుసగా థమ్స్ అప్ కు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సూపర్ స్టార్, ఇప్పటికీ మన సౌత్ తరపున ఆ సంస్థ తరపున కొనసాగుతున్నారు. ఇక ఒకానొక సమయంలో అదే బ్రాండ్ కు కొన్నాళ్ల పాటు నేషనల్ బ్రాండ్ అంబాసడర్ గా కూడా వ్యవహరించారు సూపర్ స్టార్ మహేష్. ఇక ఇటీవల కొద్దికాలంగా థమ్స్ అప్ వారు చిత్రీకరిస్తున్న యాడ్స్ ఎంతో బాగుండడంతో పాటు అవి యువతను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఆ సంస్థ మహేష్ పై తీసిన సరికొత్త యాడ్ ని మహేష్ తన ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేయగా ప్రస్తుతం అది మంచి సెన్సేషన్ గా మారింది. 

 

ఇక ఆ యాడ్ లో ఎప్పటివలె తన సూపర్బ్ యాక్షన్ తో సూపర్ స్టార్ అదరగొట్టారు. ఇక ముఖ్యంగా ఆ యాడ్ ని చూస్తుంటే అది ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద యాక్షన్ ఫిలిం కోసం తీసిన యాక్షన్ సీన్ మాదిరిగా ఉందని పలువురు నెటిజన్లు, మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది మాత్రమే కాక, గతంలో వచ్చిన కొన్ని థమ్స్ అప్ యాడ్స్ కూడా ఇదే విధంగా ఉండడంతో, ఆ సంస్థకు పని చేస్తున్న క్రియేటివ్ టీమ్ పై కూడా ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆ యాడ్ ట్విట్టర్ లో దుమ్మురేపుతూ ముందుకు దూసుకెళ్తోంది....!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: