మోస్ట్ అవైటెడ్ 'మైండ్ బ్లాక్' సాంగ్ వచ్చేస్తోంది....!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మహేష్ కు జతగా రష్మిక మందన్న నటించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించగా, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. రత్నవేలు ఫోటోగ్రఫిని అందించిన ఈ సినిమాని మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. తన కెరీర్ లో తొలిసారిగా మహేష్ బాబు ఈ సినిమాలో ఒక ఆర్మీ మేజర్ పాత్రలో నటించి మెప్పించారు.
నిజానికి మొదటి రోజు యావరేజ్ టాక్ ని సంపాదించిన ఈ సినిమాకు సంక్రాంతి సీజన్ తో అందరికీ సెలవలు రావడం తో పాటు, చాలా గ్యాప్ తరువాత తన కెరీర్ లో తొలిసారిగా మహేష్ బాబు ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ రోల్ లో నటించడంతో మెజారిటీ ప్రేక్షకులు సినిమా చూడడానికి క్యూ కట్టారు. ఇక ఈ సినిమాలోని పాటలు మొదట యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతల నుండి మంచి స్పందనను రాబట్టగా, ముఖ్యంగా మైండ్ బ్లాక్ అనే పల్లవితో సాగె మాస్ సాంగ్ కు అయితే ప్రేక్షకులు, సూపర్ స్టార్ ఫ్యాన్స్ నుండి మరింత గొప్ప స్పందన లభించింది.
ఇక సినిమా రిలీజ్ తరువాత థియేటర్స్ లో ఆ సాంగ్ లో సూపర్ స్టార్ మాస్ లుక్స్ తో పాటు ఆయన వేసిన స్టెప్స్ కు ఫ్యాన్స్ ని ఎంతో ఖుషి చేసాయి. ఇక ఈ సాంగ్ వీడియో ని ఈనెల 29వ తేదీన సరిలేరు సక్సెస్ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా యూట్యూబ్ లో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. ఈ న్యూస్ ని కాసేపటి క్రితం సినిమా యూనిట్ ఒక ప్రకటన రూపంలో రిలీజ్ చేసింది. మరి సరిలేరు థియేటర్స్ ని ఊపేసిన ఈ సాంగ్, రేవు యూట్యూబ్ లో రిలీజ్ అయి ఎంత మేర సెన్సేషన్ ని సృష్టిస్తుందో చూడాలి....!!