నాని కోసం వస్తున్న రానా, అనుష్క, రాజమౌళి..... దేనికోసమంటే....??

GVK Writings

టాలీవుడ్ నాచురల్ స్టార్ పేరు గాంచిన నాని, ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అష్టాచమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తొలిసినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న నాని, అక్కడి నుండి మెల్లగా తన టాలెంట్ తో ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగాడు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్న నాని, ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. 

 

తొలిసారిగా తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అ సినిమాని నిర్మించిన నాని, ప్రస్తుతం అదే బ్యానర్ పై ఫలక్నుమా దాస్ మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా హిట్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ని నిర్మిస్తున్నాడు. యువ దర్శకుడు శైలేష్ కొలను తీస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వేషన్ సెంటర్ లో సినిమా యూనిట్ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్వహిస్తోంది. 

 

ఇక ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, స్టార్ డైరెక్టర్లు కె రాఘవేంద్ర రావు, ఎస్ ఎస్ రాజమౌళి, యంగ్ హీరో రానా తదితరులు విచ్చేస్తున్నారు. ఇక ఈ వేడుకకు వీరు వస్తుండడంతో సినిమాకు మరింతగా పబ్లిసిటీ రావడం ఖాయం అని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఒక మంచి కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకునేలా సినిమా యూనిట్ మొత్తం కష్టపడి ఎంతో ఇష్టంతో తీసిన ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాధించి తమందరికే మంచి పేరు తెస్తుందనే నమ్మకాన్ని ఇటీవల నాని మాట్లాడుతూ చెప్పారు. ఇక ఈ సినిమాని ఈనెల 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: