ఆ సెట్ వేసేది పవన్ చిత్రం కోసమేనా...అందులో తీసే సీన్లు ఏంటంటే?
తాజాగా మరొక వార్త బయటకొచ్చింది. కాగా వీరి కలయికలో రానున్నటువంటి పీరియాడికల్ చిత్రంలో అలనాటి కాలానికి సంబందించిన అన్ని అంశాలను మేళవించేందుకు దర్శకుడు క్రిష్ ప్రయత్నిస్తున్నారు. కాగా తాజాగా దర్శకుడు క్రిష్, పవన్ కళ్యాణ్ చిత్రం కోసం చాలా పెద్ద ప్లానే వేశాడంటండోయ్.. అదేంటా అనుకుంటున్నారా. ఇంకేముంది ఈయన కూడా భారీ సెట్ల మీద పడ్డాడు. ఓ బిగ్ బోట్ సెటప్ వేయనున్నాడని సమాచారం. దీనిలో ప్రత్యేకంగా ఒక ఫైట్ సీన్ ని తీయనున్నారని సమాచారం. ఇకపోతే ఈ చిత్రాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరాడానికి ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి పవన్‌కి ఈ రెండు చిత్రాలే కాక మరో మూడు సినిమాల వరకూ ఆయన చేతిలో ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ కి ఇంక ఎక్కడా విరామం లేకుండా పవన్ అలరిస్తూనే ఉంటాడు. వీటన్నిటిలో ఏది బాగా హిట్ అవుద్దో వేచి చూడాలి. అలాగే పింక్ రీమేక్ చిత్రం కాబట్టి ఆశించినంత ఫలితం రాకపోవచ్చేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.