ఎందరో హీరోలకు కనపడే దైవం చిరంజీవి...!

Gullapally Venkatesh

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి స్థాయి వేరు. ఆయన రేంజ్ వేరు... సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలి అనుకునే వాళ్లకు ఆయన ఒక ఆదర్శం. టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న చాలా మంది హీరోలు చిరంజీవి కంటే ఎక్కువ వసూళ్లు సాధించవచ్చు. ఆయన సాధించలేని రికార్డులు సాధించవచ్చు గాని చాలా విషయాల్లో వాళ్లకు స్ఫూర్తి చిరంజీవి. అన్నయ్య సినిమా చూసిన కొంత మంది హీరోలు చిరంజీవి నటనకు ఫిదా అయిపోయారని, ఒక సినీ విశ్లేషకుడు రాసిన వాఖ్యం ఆయన అభిమానులకే కాదు టాలీవుడ్ కి కూడా ఇంకా గుర్తుంది. 

 

నా తమ్ముళ్ళు జెమ్స్ అండీ జెమ్స్ అని చిరంజీవి అనడం, సౌందర్య పక్కన ఆయన నటన, ఆ సీన్ లో ఆయన హుషారు అన్నీ కూడా టాలీవుడ్ కి ఎన్నో చెప్పాయి. అలాంటి సన్నివేశాలు చిరంజీవి కెరీర్ లో ఎన్నో ఉన్నాయి. ఆయనలా నటించాలని, ఆయనలా డాన్స్ చెయ్యాలని, ఆయనలా పవర్ ఫుల్ డైలాగులు చెప్పాలని, ఆయనలా హుందాగా ఉండాలని, సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా సరే ఆయనలా చిరు నవ్వుతో ఉండాలని ఎందరో హీరోలు ఇప్పటికీ అనుకుంటూనే ఉంటారు. 

 

అప్పుడైనా ఇప్పుడు అయినా చిరంజీవిని చూసే చాలా మంది ఫిలిం నగర్ లో యాక్టింగ్ నేర్చుకున్నారు. ఆయన సినిమాలో ఒక్క పాత్ర చేసినా చాలు అనుకునే నటులు ఎందరో. ఆయనను చూసి హీరో అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఆయన రికార్డులు బ్రేక్ చెయ్యాలని లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ళు ఎందరో. ఆయన ఏది చేసినా ఒక సంచలనమే. మహేష్ బాబు, సహా కొందరు నటులు చిరంజీవిని కనపడకుండా ఆరాధిస్తారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న చిన్న హీరోలు శర్వాన౦ద్, మెగా హీరోలు సహా చాలా మందికి ఆయన ఒక కనపడే దైవం. అందుకే చిరంజీవి అభిమానులకే కాదు హీరోలకు కూడా అభిమాన హీరో అంటారు సిని ప్రియులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: