అమ్మో ఆ హీరోయినా... మా కొద్దు బాబోయ్ అని దండం పెట్టేస్తున్నారుగా...!
ఎంత మంది యువ హీరోయిన్లు వస్తున్నా సరే ఈ భామకు ఏ భాషలోను పోటీ ఇవ్వలేకపోతున్నారు అనేది వాస్తవం. మూడున్నర పదుల వయస్సు వచ్చినా ఆమె అందం తగ్గకపోవడం, నటనలో కూడా చాలా మంది హీరోయిన్ల కంటే మెరుగ్గా ఉండటంతో దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కోలీవుడ్‌లో స్టార్టింగ్‌లో కొందరు యంగ్ హీరోయిన్లు తమ క్రేజ్‌తో నయన్‌కు పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆ తర్వాత వారు చేతులు ఎత్తేయడంతో నయన్‌కు అక్కడ తిరుగులేకుండా పోయింది.
ఇప్పుడు ఆమె ఎంత డిమండ్ చేస్తే అంత ఇచ్చి మరీ తమ సినిమాల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే హీరోలు సైతం తమ సినిమాలో నయన్ ఉంటేనే తమ సినిమాకు క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం నయన్‌కు తమిళంలో ఈమె క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుసగా ఆఫర్లు రావడంతో పారితోషకం భారీగా పెంచేసింది. ఇప్పుడు ఆమె సినిమాలకు దాదాపు ఆరు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనితో ఆమె సినిమా అనగానే నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు.
దీనికి తోడు షూటింగ్లో ఆమె అసిస్టెంట్లకు కూడా కలిపితే నిర్మాతలకు భారీగా చేతి చమురు వదులుతోందట. దీంతో వాళ్లంతా నయన్ పేరు చెపితేనే అల్లాడి పోతున్నారు. మరి నయన్ ఇంత చేసినా ప్రమోషన్లకు రాకుండా నిర్మాతలను, హీరోలను నానా ఇబ్బందులు పెడుతుందన్నదే ప్రధాన ఆరోపణ.