నువ్వు పెట్టె నియమాలే, నిన్ను నిలువునా నాకించేశాయి తల్లి....!!
తెలుగు సినిమా పరిశ్రమకు విక్టరీ వెంకటేష్ సరసన లక్ష్మి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా నటించి మంచి పేరు దక్కించుకున్న నయనతార, ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ అందుకుంది. ఇక తరువాత ఆమె నటించిన సినిమాల్లో కొన్ని సినిమాలు హిట్ కాగా మరికొన్ని ఫ్లాపులు అయ్యాయి. ఇక ఇటువైపు తెలుగుతో పాటు మధ్యలో కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించిన నయనతార, రెండు భాషల్లోని దాదాపుగా అందరు ప్రముఖ హీరోల సరసన నటించి మంచి పేరు దక్కించుకుంది. ఇక ఇటీవల వెంకటేష్ సరసన బాబు బంగారం సినిమాలో నటించిన నయన్ పై దర్శకుడు మారుతీ కొద్దిపాటి విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక సీన్ షూట్ అయిపోయాక హీరో వెంకటేష్ రాగానే నయన్ కనీసం లేచి నిలబడలేదని, ఒక ప్రముఖ హీరోకి మనం ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ మారుతీ, నయన్ ప్రవర్తనపై కొంత నిరాసక్తత వ్యక్తం చేసారు. ఇకపోతే అటు తమిళ్ లో కూడా మంచి పేరు సంపాదించిన నయన్ కు మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా ఆమె పెడుతున్న రూల్స్ వలన ఆమెకు రాను రాను అవకాశాలు తగ్గడంతో పాటు దర్శక, నిర్మాతలకు ఆమె అంటేనే భయపడే పరిస్థితులు తలెత్తుతున్నాయని వార్తలు ప్రచారం అవుతున్నాయి. నిజానికి ఇటీవల తన సినిమాల విషయమై నయనతార పెడుతున్న రూల్స్ కు పలువురు దర్శక, నిర్మాతలు బెంబేలెత్తుతున్నారని,
ఆమె నటిస్తున్న సినిమాల షూటింగ్ పూర్తి అయిన తరువాత కనీసం ఒక్కసారి కూడా ప్రమోషన్స్ కు హాజరు కాకపోవడం ఆమె పై చాలావరకు నెగటివ్ ఇంప్రెషన్ తెచేపిపెడుతోందని, అలానే కొద్దిరోజుల క్రితం తెలుగులో మెగాస్టార్ సరసన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించిన నయన్, కనీసం ఒక్కసారైనా తెలుగు ప్రేక్షకుల మొహం చూసింది లేదని విపరీతంగా ఆమె పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ విధంగా ఆమె పెడుతున్న నియమ, నిబంధనలే ఆమెకు అవకాశాలు రాకుండా చేయడంతో పాటు, ఆమె కెరీర్ ని నిలువునా ముంచేస్తున్నాయని అంటున్నారు. మరి నయన్ ఇకనైనా తన పద్ధతి మార్చుకుంటుందో లేదో చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు...!!