అఖిల్, హలో , మిస్టర్ మజ్ను సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసిన యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తన నాల్గవ సినిమా లో నటిస్తున్నాడు. గత కొన్ని నెలల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను విడుదలచేసింది చిత్ర బృందం. ఈసినిమాకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే రెండు రోజుల ముందే ఈటైటిల్ లీక్ అయ్యింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈనెల 8న సాయంత్రం 6:18 గంటలకు విడుదలచేయనున్నారు.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నఈచిత్రంలో అఖిల్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ఫై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలకానుంది. కాగా ఫిలిం నగర్ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం సినిమా బాగానే వస్తుందట. ముఖ్యంగా పూజా , అఖిల్ కెమిస్ట్రీ ఈ సినిమాలో హైలైట్ అవ్వనుందట. ఇక గీత గోవిందం,టాక్సీవాలా,ప్రతి రోజు పండగే లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ 2 ఈ సినిమాను నిర్మిస్తుడడం అలాగే వరస సక్సెస్ లతో స్టార్ హీరోయిన్ గా మారిన పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తుండడం తో ఈ చిత్రం పై మంచి అంచనాలే వున్నాయి. ఇదిలా ఉంటే ఈచిత్రం పై అఖిల్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. అఖిల్ తోపాటు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కు కూడా ఈచిత్ర విజయం కీలకం కానుంది. బొమ్మరిల్లు , పరుగు తరువాత భాస్కర్ కూడా ఫామ్ కోల్పోయాడు. మరి ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ తోనైనా అఖిల్ , భాస్కర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో చూడాలి.