పవన్ మూవీ నుండి మరొక లీక్.....  దర్శక, నిర్మాతలకు క్లాస్ పీకిన పవన్.....!!

GVK Writings

టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు, బోని కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్, ఆపై రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయ్యారు. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన పవన్, 

 

అతి త్వరలో దీనిని పూర్తి చేసిన అనంతరం క్రిష్ సినిమాలో జాయిన్ అవుతారని టాక్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల బ్లాక్ డ్రెస్ లో ఉన్న పవన్ లుక్ మీడియా మాధ్యమాల్లో లీక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ లీకులపై నిర్మాత దిల్ రాజు సహా హీరో పవన్ కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే నేడు ఈ సినిమా నుండి ఏకంగా పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్ లో చెప్తున్న ఒక డైలాగ్ వీడియో నే సోషల్ మీడియా మాధ్యమాల్లో లీక్ అయింది. `నేను న‌ల్లకోటు వేసుకున్నానంటే వేసుకోవ‌డానికి పిటీష‌న్‌లు, తీసుకోవ‌డానికి మెయిల్లు వుండ‌వు` అని ఓ స‌న్నివేశంలో ప‌వ‌న్ చెబుతున్న ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్ప‌డు హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

 

ఇక అది చూసిన వారందరూ కూడా సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాదిస్తుందని, అలానే సినిమాలో పవన్ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండనుందో అర్ధం అవుతుందని అంటున్నారు. అయితే ఈ విధంగా వీడియో లీక్ అవ్వడంతో దర్శక, నిర్మాతలపై పవన్ కొంత మండిపడ్డట్లు సమాచారం. 
నిజానికి షూటింగ్ స్పాట్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఏదో విధంగా ఇలా సినిమా లీకుల బారిన పడడం తమను ఆవేదనకు గురి చేస్తోందని, కావున ఇకపై షూటింగ్ జరిగే సమయంలో మరింత గట్టిగా భద్రతా చర్యలు తీసుకంటామని మూవీ యూనిట్ చెప్తున్నట్లు తెలుస్తోంది. నివేత థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండవ వారంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: