నాగ చైతన్య హీరోయిన్ అందాల ప్రదర్శన చూసారా....??

GVK Writings

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ ఎంటర్టైనర్ మజిలీ. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి హిట్ సాధించింది. నాగ చైతన్య సరసన సమంత, దివ్యంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో చైతన్య క్రికెట్ ని ఇష్టపడే యువకుడిగా నటించాడు. అయితే మొదట్లో ఒక అమ్మాయిని ప్రేమించిన హీరో, ఆ తరువాత ఆమె నుండి విడిపోవడం, అనంతరం పరిస్థితుల ప్రభావం వలన మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. 

 

ఇక ఇందులో చైతన్య ప్రేమించేది దివిషాంశ ని, ఆమెకు ఇది తెలుగులో డెబ్యూ మూవీ. అయినప్పటికీ కూడా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దివ్యంశ, మంచి పేరు సంపాదించింది. అయితే ఆ సినిమా హిట్ అయినప్పటికీ కూడా ఆమెకు ఇప్పటివరకు తెలుగులో మరొక  అవకాశం రాకపోవడం ఒకింత విచిత్రం అనే చెప్పాలి. ఇక ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు తన ఫొటోస్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే దివ్యంశ, నేడు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. 

 

రకరకాల ఫోజుల్లో ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తున్న పలువురు నెటిజన్లు, మీ అందానికి ఈపాటికి ఎన్నో అవకాశాలు రావలసి ఉంది మేడం, అతి త్వరలో తప్పకుండా మన తెలుగులో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విధంగా మంచి హాట్ హాట్ గా అందాలు ప్రదర్శిస్తున్న దివ్యంశ కు ఇకపైనైనా మన తెలుగులో మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి. వస్తే మాత్రం ఆమె రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే మరి....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: