ఒకటి కాదు... ఏకంగా రెండు చావుదెబ్బలేస్తే, ఇంక ఆయనేం కోలుకుంటాడు బ్రదరూ.....!!
టాలీవుడ్ నటుడు మాస్ మహారాజ రవితేజ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన డిస్కో రాజా సినిమా ఆల్మోస్ట్ ఫ్లాప్ టాక్ తో ప్రస్తుతం ముందుకు నడుస్తోంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ, సెకండ్ హాఫ్ ని దర్శకుడు ఆనంద్ ఎక్కువ రొటీన్ గా నడపడంతో సినిమాపై మెజారిటీ ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, దాదాపుగా రూ.30 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమాకు ఓవరాల్ గా రూ.22 కోట్లు మాత్రమే బిజినెస్ జరిగిందని,
అయితే ప్రస్తుతం సినిమా పరిస్థితి చూస్తుంటే చాలా మంది బయ్యర్లకు భారీ స్థాయిలో నష్టాలు రావడంతో పాటు నిర్మాత రామ్ తాళ్లూరికి కూడా లాస్ తప్పేలా లేదట. అయితే ఇదే రామ్ తాళ్లూరి గతంలో రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టిక్కెట్టు అనే సినిమాని నిర్మించడం జరిగింది. అంతకముందు కళ్యాణ్ కృష్ణ, నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయనా, అలానే నాగ చైతన్యతో రారండోయి వేడుక చూద్దాం వంటి హిట్ సినిమాలు తీసి ఉండడంతో ఆయనకు దర్శకుడిగా బాధ్యతలు అప్పగించారు. అయితే పలు మాస్ అంశాలతో తెరకెక్కిన నేల టిక్కెట్టు సినిమా మాత్రం అప్పట్లో ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో పూర్తిగా విఫలం అయి భారీ డిజాస్టర్ గా నిలిచింది.
అయినప్పటికీ కూడా మరొకసారి రామ్ తాళ్లూరి, రవితేజతో డేర్ చేసి ప్రస్తుతం డిస్కో రాజా నిర్మించినప్పటికీ, ఇది కూడా దెబ్బేయడంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి ఒకింత ఇబ్బందుల్లో ఉందని అంటున్నారు. అయితే ఈ విధంగా ఒకదానివెంట మరొకటి చావుదెబ్బలు పడడంతో రామ్ తాళ్లూరి తదుపరి నిర్మించబోయే సినిమాల విషయంలో పూర్తిగా జాగ్రత్త వహించాలని నిర్ణయిచారట. అలానే వీటివలన వచ్చిన నష్టాలు కూడా పూడ్చుకునేలా ఇకపై సరైన కథ, కథనాలతో పాటు మంచి పట్టున్న దర్శకుడితో సినిమా తీయాలని నిర్ణయించారట. అయితే వరుసగా రెండు దెబ్బలు పడడంతో కొంత ఆలోచనలో పడ్డ రామ్ తాళ్లూరి, రాబోయే రోజుల్లో ఎవరితో సినిమా తీస్తారో చూడాలి....!!