డిస్కో రాజా దెబ్బకి ఉస్కో అనేవాడే, కానీ....??

GVK Writings

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ మూవీ డిస్కో రాజా. యువ దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత రామ్ తాళ్లూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఇటీవల ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓవరాల్ గా నెగటివ్ టాక్ ని మూటగట్టుకుని ప్రస్తుతం ముందుకు సాగుతోంది. మాస్ రాజా డబుల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో నభ నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించగా ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని, కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫిని అందించడం జరిగింది. ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలోని సాంగ్స్ పెద్దగా శ్రోతలను ఆకట్టుకోలేదనే చెప్పాలి. 

 

ఇక సినిమా రిలీజ్ అయి నెగటివ్ టాక్ ని మూటగట్టుకోవడంతో పాటు సినిమాలో సాంగ్స్ కూడా పెద్దగా ప్రేక్షకులను అలరించలేదు. దీనితో కొందరు మాస్ రాజా ఫ్యాన్స్, థమన్ పై విరుచుకుపడుతున్నారు. ఇకపోతే ఇటీవల సంక్రాంతి సీజన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబో మూవీ అలవైకుంఠపురములో కు సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ని అందించిన థమన్, తమ హీరో సినిమాకు చాలావరకు అన్యాయం చేసాడని వారు వాపోతూ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొందరు ప్రేక్షకులు కూడా ఈ సినిమా సాంగ్స్ బాగోలేవని బహిరంగంగా చెప్తుండడం కూడా ఇక్కడ గమనించవలసిన విషయం. 

 

ఇక ఈ సినిమా పరాజయంతో థమన్ ఖాతాలో మరొక ఫ్లాప్ పడింది. నిజానికి ఈ డిస్కో రాజా సినిమా దెబ్బకు థమన్ ఉస్కో అనేవాడేనని, అయితే ఆయన అందించిన అల సినిమా సాంగ్స్ అదిరిపోవడంతో పాటు ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో థమన్ బ్రతికిపోయాడని అంటున్నారు. ఇక మరికొందరు అయితే ఇకపై మీరు మ్యూజిక్ ఇవ్వబోయే పవర్ స్టార్ పింక్ రీమేక్ తో పాటు, సూపర్ స్టార్ మహేష్ తదుపరి సినిమాలు అదరగొట్టాల్సిందే అని, ఒకవేళ అతడు వాటికి కూడా సరైన మ్యూజిక్ ఇవ్వకపోతే ఇంక అంతే సంగతులు అని అంటున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: